IND vs SA: వన్డే సిరీస్ అయినా పట్టేస్తారా.?
నేడు భారత్- సౌతాఫ్రికా "ఫైనల్"... 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లు... విశాఖ వేదికగా కీలక మూడో వన్డే.. తీవ్ర ఒత్తిడిలో టీమిండియా
భారత్ - దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ ఫైనల్ మ్యాచ్ విశాఖపట్టణంలో జరగనుంది. తొలి రెండు మ్యాచ్‌లు చెరోటి గెలవడంతో సిరీస్ 1 - 1తో సమమైంది. టెస్టుల్లో ఓటమి, వన్డేల్లోనూ ఓడితే తీవ్ర విమర్శలు ఎదుర్కొనే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వైజాగ్‌కు చేరుకోగానే దగ్గరలోని సింహాచలంలో ప్రత్యేక పూజలు చేశారు. బ్యాటింగ్ అదరగొట్టినా బౌలింగ్ తేలిపోవడంతో టీమిండియాలో మార్పులు తప్పవని తెలుస్తోంది. సిరీస్ డిసైడర్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి!
ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవెన్‌లను అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. భారత్ గతంలో ఓడిపోయినప్పటికీ, కెప్టెన్ కేఎల్ రాహుల్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఎటువంటి మార్పులు చేసే అవకాశం లేదు. నితీష్ కుమార్ రెడ్డి, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, తిలక్ వర్మలను మరోసారి బెంచ్‌లో కూర్చోబెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే వరుసగా రెండు సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో భారత జట్టు తరపున బలమైన ప్రదర్శన ఇవ్వాలని చూస్తున్నాడు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ కూడా బ్యాట్‌తో సందడి చేయడానికి ఆసక్తిగా ఉంటారు. రాయ్‌పూర్ వన్డేలో 4వ స్థానంలో బ్యాటింగ్ చేసిన రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. అతని ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీ ఆడే విధానానికి దాదాపు సమానంగా ఉంది. రుతురాజ్ షాట్లు క్లాసిక్, నియంత్రణలో ఉన్నాయి. గత మ్యాచ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ 85 పరుగులు ఇచ్చాడు.. కానీ ఇక్కడ పెద్ద సమస్య ఏమిటంటే భారత జట్టులో స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ లేడు. కాబట్టి భారత జట్టు అతన్ని తొలగించి ఆల్ రౌండర్‌ను చేర్చే సాహసం చేయదు.
రికార్డులు ఇలా....
ఈ గ్రౌండ్ లో ఇప్పటి వరకు భారత జట్టు పది మ్యాచ్ లు ఆడింది. ఇందులో ఏడింటిలో గెలవగా, రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. ఈ రికార్డులు భారత జట్టుకు అనుకూలించే ఛాన్సులు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జట్టుకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఇప్పటికైనా భారత జట్టు టాస్ గెలుస్తుందో లేదో చూడాలి. అలాగే ఈ మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వస్తాడని అంటున్నారు. అతడు జట్టులోకి వస్తే ఎవరిపైన వేటు వేయాలి అనే దాని పైన ఆలోచన చేస్తున్నారు. ఓపెనర్ యశస్వి జైష్వాల్ పై వేటు వేసి నితీష్ కుమార్ రెడ్డిని తీసుకువస్తారని చెబుతున్నారు. లేదా రిషబ్ పంత్ తుది జట్టులోకి వస్తాడని కూడా కొంతమంది చెబుతున్నారు.