IND WIN: కివీస్ బౌలర్లను వేటాడేసిన భారత బ్యాటర్లు

టీమిండియా బ్యాటర్ల ఊచకోత... కివీస్‌ను చిత్తు చేసిన భారత జట్టు... 154 రన్స్ లక్ష్యం 10 ఓవర్లలోనే ఛేదన.. బంతితో చెలరేగిన జస్ప్రీత్ బుమ్రా

Update: 2026-01-26 01:52 GMT

భారత క్రి­కె­ట్‌ మరో­సా­రి తన ఆధి­ప­త్యా­న్ని చా­టు­కుం­ది. న్యూ­జి­లాం­డ్‌­తో జరి­గిన మూడో టీ20 మ్యా­చ్‌­లో బ్యా­ట్‌, బం­తి­తో సమ­న్వ­యం­గా మె­రి­సిన టీ­మ్‌­ఇం­డి­యా.. ప్ర­త్య­ర్థి­ని ఏ మా­త్రం అవ­కా­శం ఇవ్వ­కుం­డా 8 వి­కె­ట్ల తే­డా­తో చి­త్తు­గా ఓడిం­చిం­ది. ఈ వి­జ­యం­తో సి­రీ­స్‌­ను ఇప్ప­టి­కే కై­వ­సం చే­సు­కు­న్న భా­ర­త్‌ 3-0తో తి­రు­గు­లే­ని ఆధి­క్యం సా­ధిం­చిం­ది. భారత యువత శక్తి, అను­భ­వ­జ్ఞుల స్థి­ర­త్వం కలసి ఈ మ్యా­చ్‌­ను ఏక­ప­క్షం­గా మా­ర్చే­శా­యి. ముం­దు­గా బ్యా­టిం­గ్‌ చే­సిన న్యూ­జి­లాం­డ్‌ ని­ర్ణీత 20 ఓవ­ర్ల­లో 9 వి­కె­ట్ల నష్టా­ని­కి 153 పరు­గు­లు మా­త్ర­మే చే­య­గ­లి­గిం­ది. భారత బౌ­ల­ర్లు కట్టు­ది­ట్టం­గా బం­తు­లు వే­య­డం­తో కి­వీ­స్‌ బ్యా­ట­ర్లు స్వే­చ్ఛ­గా ఆడ­లే­క­పో­యా­రు. గ్లె­న్‌ ఫి­లి­ప్స్‌ 48 పరు­గు­ల­తో టా­ప్‌ స్కో­ర­ర్‌­గా ని­లి­చి­నా.. అతడి ఇన్నిం­గ్స్‌ కూడా జట్టు­ను పె­ద్ద స్కో­రు వైపు నడి­పిం­చ­లే­క­పో­యిం­ది. మా­ర్క్‌ చా­ప్‌­మ­న్‌, మి­చె­ల్‌ శాం­ట్న­ర్‌ మి­న­హా మి­గ­తా బ్యా­ట­ర్లు భారత బౌ­లిం­గ్‌ ఒత్తి­డి­ని తట్టు­కో­లే­క­పో­యా­రు.

ఇన్నిం­గ్స్‌ ఆరం­భం­లో­నే న్యూ­జి­లాం­డ్‌­కు షా­క్‌ తగి­లిం­ది. తొలి ఓవ­ర్లో­నే డె­వో­న్‌ కా­న్వే­ను హర్షి­త్‌ రాణా అవు­ట్‌ చే­శా­డు. ముం­దు­కొ­చ్చి దూ­కు­డు­గా ఆడా­ల­ను­కు­న్న కా­న్వే.. మి­డా­ఫ్‌ వద్ద హా­ర్ది­క్‌ పాం­డ్య పట్టిన అద్భుత క్యా­చ్‌­కు వె­ను­ది­ర­గా­ల్సి వచ్చిం­ది. ఈ పర్య­ట­న­లో కా­న్వే­ను అవు­ట్‌ చే­య­డం హర్షి­త్‌­కు ఇది అయి­దో­సా­రి కా­వ­డం గమ­నా­ర్హం. వెం­ట­నే మరో ఓవ­ర్లో రచి­న్‌ రవీం­ద్ర­ను హా­ర్ది­క్‌ పాం­డ్య షా­ర్ట్‌ బం­తి­తో బౌ­ల్డ్‌ చే­య­డం­తో న్యూ­జి­లాం­డ్‌ 2 ఓవ­ర్ల­కే రెం­డు కీలక వి­కె­ట్లు కో­ల్పో­యిం­ది. ఆ తర్వాత గ్లెన్‌ ఫిలిప్స్‌ కొంత బాధ్యత తీసుకుని ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. అడపాడదపా ఫోర్లు, సిక్స్‌లతో స్కోరు పెంచాడు. పవర్‌ప్లే ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

మధ్య ఓవ­ర్ల­లో కూడా భారత బౌ­ల­ర్లు ఏ మా­త్రం సడ­లిం­పు ఇవ్వ­లే­దు. రవి బి­ష్ణో­య్‌ తన గూ­గ్లీ­లు, ఫ్లి­ప్ప­ర్ల­తో బ్యా­ట­ర్ల­ను ఇబ్బం­ది పె­ట్టా­డు. కు­ల్దీ­ప్‌ యా­ద­వ్‌ వే­సిన ఓవ­ర్‌­లో చా­ప్‌­మ­న్‌, ఫి­లి­ప్స్‌ కొ­న్ని భారీ షా­ట్లు ఆడ­డం­తో స్కో­రు కొంత ఊపం­దు­కు­న్నా.. కీలక సమ­యం­లో వరుస వి­కె­ట్లు పడ­టం­తో న్యూ­జి­లాం­డ్‌ భారీ స్కో­రు సా­ధిం­చ­లే­క­పో­యిం­ది. చి­వ­ర్లో కె­ప్టె­న్‌ మి­చె­ల్‌ శాం­ట్న­ర్‌ పో­రా­టం చే­సి­నా.. భారత బౌ­లిం­గ్‌ దె­బ్బ­కు కి­వీ­స్‌ 153 పరు­గు­ల­కే పరి­మి­త­మ­య్యిం­ది. భారత బౌ­లిం­గ్‌­లో జస్ప్రీ­త్‌ బు­మ్రా 3 వి­కె­ట్లు తీసి ‘ప్లే­య­ర్‌ ఆఫ్‌ ద మ్యా­చ్‌’గా ని­లి­చా­డు. రవి బి­ష్ణో­య్‌, హా­ర్ది­క్‌ పాం­డ్య తలో రెం­డు వి­కె­ట్లు తీసి కీలక పా­త్ర పో­షిం­చా­రు. 153 పరు­గుల లక్ష్యం­తో బ్యా­టిం­గ్‌­కు ది­గిన భా­ర­త్‌ మొ­ద­టి­సా­రి చి­న్న ఆటు­పో­టు­ను ఎదు­ర్కొం­ది. తొలి బం­తి­కే సంజూ శాం­స­న్‌ సు­న్నా­కే వె­ను­ది­ర­గ­డం అభి­మా­ను­ల­ను క్ష­ణ­కా­లం ఆం­దో­ళ­న­కు గు­రి­చే­సిం­ది. హె­న్రీ వే­సిన బం­తి­కి క్లీ­న్‌­బౌ­ల్డ్‌ అయిన సంజూ.. తన వై­ఫ­ల్యాల పరం­ప­ర­ను కొ­న­సా­గిం­చా­డు. అయి­తే ఆ వెం­ట­నే ఇషా­న్‌ కి­ష­న్‌ బ్యా­ట్‌ ఝు­ళి­పిం­చ­డం­తో ఆ వి­కె­ట్‌ ప్ర­భా­వం కని­పిం­చ­లే­దు. ఇషా­న్‌ తొలి ఓవ­ర్‌­లో­నే వరు­స­గా రెం­డు సి­క్స్‌­లు, ఓ ఫో­ర్‌ బాది భారత ఇన్నిం­గ్స్‌­కు వేగం అం­దిం­చా­డు. మరో వైపు అభి­షే­క్‌ శర్మ కూడా దూ­కు­డు కొ­న­సా­గిం­చా­డు. మూడు ఓవ­ర్లు ము­గి­సే సరి­కి భా­ర­త్‌ 49 పరు­గు­లు సా­ధిం­చి మ్యా­చ్‌­ను పూ­ర్తి­గా తన ఆధీ­నం­లో­కి తీ­సు­కుం­ది. సోధి బౌ­లిం­గ్‌­లో ఇషా­న్‌ అవు­ట్‌ అయి­నా.. అభి­షే­క్‌ ఆగ­లే­దు. బు­ధ­వా­రం వి­శా­ఖ­ప­ట్నం­లో జర­గ­ను­న్న నా­లు­గో టీ20 మ్యా­చ్‌­పై భారీ అం­చ­నా­లు నె­ల­కొ­న్నా­యి.

Tags:    

Similar News