India vs South Africa : కుప్పకూలిన టీమ్‌ఇండియా.. 202 పరుగులకు ఆలౌట్

India vs South Africa : దక్షిణాఫ్రికాతో మొదటి టెస్ట్ లో విజయభేరి మోగించిన టీంఇండియా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

Update: 2022-01-03 14:36 GMT

India vs South Africa : దక్షిణాఫ్రికాతో మొదటి టెస్ట్ లో విజయభేరి మోగించిన టీంఇండియా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్‌ కేఎల్ రాహుల్ (50) అర్ధ శతకంతో రాణించాడు. సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (46) అర్ధ శతకం చేజారినా.. కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్ (26), హనుమ విహారి (20), రిషభ్‌ పంత్‌ (17), మహమ్మద్‌ షమి (9), ఛెతేశ్వర్‌ పుజారా (3), మహమ్మద్ సిరాజ్‌ (1) పరుగులు చేశారు. అటు దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్‌ నాలుగు, ఒలివర్‌ మూడు, కగిసో రబాడ మూడు వికెట్లు పడగొట్టారు. 

Tags:    

Similar News