హద్దు దాటిన ఇంగ్లండ్ ఫ్యాన్స్..రాహుల్‌పై బీర్ బాటిల్ మూతలు..
India Vs England: లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్- టీమిండియా మధ్య రెండో టెస్టు జరుతుంది. కేఎల్ రాహుల్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిశాడు;
India Vs England: లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్- టీమిండియా మధ్య రెండో టెస్టు జరుతుంది. కేఎల్ రాహుల్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ మధ్యలో కొందరు అభిమానులు హద్దులు దాటారు. కేఎల్ రాహుల్‌ను టార్గెట్ చేస్తూ కొందరు ఆకతాయిలు బీర్ బాటిల్ మూతలు విసిరారు. మూడో రోజు ఆటలో భాగంగా ఇన్నింగ్స్ 69వ ఓవర్‌లో నడుస్తుండగా.. రాహుల్ బౌండరీ లైన్ వద్ద ఫిల్డ్ లో ఉన్నాడు. రాహుల్ ను చూసి ఆకతాయిలు రెచ్చిపోయారు. అతనిపై బీర్ బాటిల్ మూతలు విసిరారు.ఇది చూసిన రాహుల్ అంపైర్లకు ఫిర్యాదు చేశాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఆగ్రహం తెప్పించింది. అయితే ఈ వ్యవహారంపై స్పందిస్తూ కోహ్లి రాహుల్ వైపు తిరిగి.. '' ఆ మూతలను తిరిగి వారిపైనే విసురు'' అన్నట్లుగా సిగ్నల్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే కోహ్లి ఇలాంటికి అసలు సహించడు. కోహ్లీ ఈ అంశాన్ని అక్కడితో వదిలేయడంతో మ్యాచ్ కొనసాగింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ రెండో టెస్టులో కెప్టెన్ రూట్ 151పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 110 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసింది. మొయిన్ అలీ28 పరుగుల చేసి ఔటైయ్యాడు. భారత బౌలర్లలో సిరాజ్ మూడు, షమీ 1, ఇషాంత్ శర్మ 2 వికెట్లు పడగొట్టారు.