IND vs ENG 1st Test: తొలి రోజు అదరగొట్టిన టీమిండియా బౌలర్లు..

IND VS ENG 1st Test:నాటింగ్‌హామ్‌ వేదికగా టీమిండియా - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు భారత్ పై చేయి సాధించింది

Update: 2021-08-05 03:04 GMT

IND VS ENG 1st Test: నాటింగ్‌హామ్‌ వేదికగా టీమిండియా - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు భారత్ పై చేయి సాధించింది. టీమిండియా బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకు ఆలౌటైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ కెప్టెన్‌ జో రూట్‌ అర్థ సెంచరీతో రాణించాడు. 89 బంతుల్లో 9 ఫోర్లుతో 69పరుగులు చేశాడు. జానీ బెయిర్‌ స్టో 29 పరుగులతో రాణించాడు. నాలుగో వికెట్ కు ఇద్దరి మధ్య 70 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదైంది. మిగతా బ్యాట్స్ మెన్ విఫలమైయ్యారు. 59 ఓవర్‌ మొదటి బంతికి 64 పరుగులు చేసిన రూట్‌ను ఎల్బీగా వెనక్కి పంపిన శార్దూల్‌ ఆ తర్వాత నాలుగో బంతికి ఓలీ రాబిన్‌సన్‌ను డకౌట్‌గా పెవిలియన్‌ చేర్చాడు.

ఇంగ్లండ్ పతనం ప్రారంభమైంది. బెరిస్టోను షమి పెవిలియన్ కు పంపాడు. శామ్ కరణ్ ఒక్కడే 27 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దాంతో ఇంగ్లండ్ 65.4 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 183 పరుగుల స్కోరు చేసింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా నాలుగు పడగొట్టగా.., షమీ మూడు వికెట్లు తీశాడు. శార్దుల్‌ ఠాకూర్‌ రెండు, సిరాజ్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు.

అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్ అ తొలి రోజు వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ 9 పరుగులు, రాహుల్‌ 9 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఇద్దరూ తొలి సెషన్ వరకు వికెట్ పడకుండా జాగ్రత్త పడితే మ్యాచ్ పై పట్టు సాధించవచ్చు.. నాటింగ్‌హామ్‌ రెండో రోజు పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.

Tags:    

Similar News