RONALDO: రొనాల్డో అంటే పేరు అనుకుంటివా.. బ్రాండ్

40 ఏళ్ల వయసులో అదరగొడుతున్న దిగ్గజం... రూ. 2000 వేల కోట్లతో మళ్లీ దక్కించుకున్న సౌదీ;

Update: 2025-06-29 08:30 GMT

ప్ర­పం­చం­లో ఎన్ని క్రీ­డ­లు­న్నా, ఏ దే­శా­ల­కు ఎంత మా­ర్కె­ట్ ఉన్నా.. ఆటతో పాటు బ్రాం­డ్ వా­ల్యూ క్రి­యే­ట్ చే­సిం­ది ప్ర­పం­చం­లో­నే ఒక చి­న్న దే­శా­ని­కి చెం­దిన అథ్లె­ట్. అవు­ను.. పో­ర్చు­గీ­స్‌­కి చెం­దిన క్రి­స్టి­యా­నో రొ­నా­ల్డో అంటే ఒక పేరు కాదు.. ఎవరు అం­దు­కో­లే­ని బ్రాం­డ్. అతను కే­వ­లం మా­ర్కె­ట్ మా­త్ర­మే కాదు ఆటకు అలం­కా­రం. తా­జా­గా సౌదీ అరే­బి­యా అత­న్ని రూ. 2000 కో­ట్ల వా­ర్షిక జీ­తం­తో రి­టై­న్ చే­సు­కు­న్న సం­గ­తి తె­లి­సిం­దే. 40 ఏళ్ల వయ­సు­లో ఎవ­రి­నై­నా టీం­లో­కి తీ­సు­కో­వ­డ­మే ఎక్కువ అను­కుం­టే రూ. 2000 కో­ట్లు ఇచ్చి మరి తీ­సు­కు­న్నా­రు అంటే రొ­నా­ల్డో ఒక మా­మూ­లు క్రీ­డా­కా­రు­డు కాదు.. అత­నొక కేసు స్ట­డీ అం­టు­న్నా­రు డా­క్ట­ర్లు. ఫు­ట్‌­బా­ల్ లాం­టి కఠి­న­మైన క్రీ­డ­ల్లో ఫి­ట్‌­గా ఉంటూ ఇన్నే­ళ్ల పాటు కె­రీ­ర్‌­ను కొ­న­సా­గిం­చ­డం అంత ఈజీ కాదు. కానీ రొ­నా­ల్డో మా­త్రం ఇప్ప­టి­కీ అద్భు­త­మైన ఫి­ట్‌­నె­స్‌­తో వరుస టో­ర్నీ­ల్లో ఆడు­తూ వర­ల్డ్ బె­స్ట్ ప్లే­య­ర్‌­గా దు­మ్ము­రే­పు­తు­న్నా­డు. అతడి ఫి­ట్‌­నె­స్, హె­ల్త్ సీ­క్రె­ట్ ఏంటో కను­క్కు­నేం­దు­కు అభి­మా­ను­లు చాలా ఆస­క్తి చూ­పి­స్తుం­టా­రు. తా­జా­గా ఈ వి­ష­యం­పై సౌదీ అరే­బి­యా­కు చెం­దిన డా­క్ట­ర్ మహ్మ­ద్ అలీ అల్ అహ్మ­దీ కీలక వ్యా­ఖ్య­లు చే­శా­రు. బయ­ట­కు కని­పిం­చే ఫి­జి­క­ల్ ఏజ్ కంటే రొ­నా­ల్డో బయో­లా­జి­క­ల్ ఏజ్ ఇంకా తక్కువ అని అన్నా­రు. అతడు అథ్లె­ట్ మా­త్ర­మే కాదు.. ఒక కేస్ స్ట­డీ అని చె­ప్పా­రు.

రొనాల్డో మీద పరిశోధనలు

‘రొ­నా­ల్డో­ను కే­వ­లం అథ్లె­ట్‌­గా మా­త్ర­మే చూ­డొ­ద్దు. అతడో కేస్ స్ట­డీ. అతడి బయో­లా­జి­క­ల్ ఏజ్ 20 అని చె­ప్పొ­చ్చు. 40 ఏళ్లు నిం­డి­నా అతడు రో­జు­రో­జు­కీ మరింత చి­న్న­వా­డి­లా మా­రు­తు­న్నా­డు. వయసు పె­రు­గు­తు­న్నా అతడు యవ్వ­నం­గా కని­పి­స్తు­న్నా­డు. ఇం­దు­కు ఫి­ట్‌­నె­స్, ఆహా­ర­పు అల­వా­ట్లే ప్ర­ధాన కా­ర­ణం. రొ­నా­ల్డో శరీ­రం­లో 50 శాతం మజి­ల్ మాస్, 7 శాతం బాడీ ఫ్యా­ట్ ఉన్నా­యి. ఆహా­రం, ని­ద్ర, ట్రె­యి­నిం­గ్.. ఇలా ప్ర­తి­దా­న్నీ శా­స్త్రీ­యం­గా ప్లా­న్ చే­సు­కొ­ని పా­టిం­చ­డం వల్లే ఇది సా­ధ్య­మైం­ది’ అని సైం­టి­స్ట్ అలీ అల్ అహ్మ­దీ పే­ర్కొ­న్నా­రు. అవ­కా­శం వస్తే రొ­నా­ల్డో మీద మరి­న్ని పరి­శో­ధ­న­లు చేసి ప్ర­పం­చా­ని­కి అం­ది­స్తా­న­ని, అం­ద­రూ అంత ఆరో­గ్యం­గా, ఫి­ట్‌­గా ఉం­డేం­దు­కు అది దో­హ­ద­ప­డు­తుం­ద­న్నా­రు.

Tags:    

Similar News