T Natarajan Tests Positive : సన్‌రైజర్స్‌కి బిగ్ షాక్.. నటరాజన్‌కు కరోనా పాజిటివ్
T Natarajan Tests Positive : సన్‌రైజర్స్ టీంకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ఆటగాడు నటరాజన్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.;
T Natarajan Tests Positive : సన్‌రైజర్స్ టీంకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ఆటగాడు నటరాజన్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే ప్రస్తుతం అతనికి లక్షణాలేమీ లేనప్పటికీ ఐసోలేషన్‌లో ఉన్నాడు. నటరాజన్‌కి కరోనా నిర్ధారణ కావడంతో జట్టులోని ప్లేయర్స్ అందరికి మరోసారి RTPCR పరీక్షలు చేయనున్నారు. కాగా ఈ రోజు రాత్రి హైదరాబాద్, ఢిల్లీ జట్లు తలపడాల్సి ఉండగా మ్యాచ్ పైన సందిగ్ధత నెలకొంది. పరీక్షల ఫలితాల తర్వాతే ఈ విషయం పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతకుముందు మేలో, నలుగురు క్రికెటర్లకి కరోనా సోకడంతో IPL 14వ సీజన్‌ని మధ్యలోనే నిలిపివేశారు నిర్వాహకులు.. దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత మళ్ళీ సీజన్ ని కొనసాగిస్తున్నారు.