IPL: ఢిల్లీ జైత్రయాత్ర

బెంగళూరుపై ఢిల్లీ ఘన విజయం... కేఎల్‌ రాహుల్ ఒంటరి పోరాటం;

Update: 2025-04-11 02:00 GMT

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది. ఢిల్లీకిది వరుసగా నాలుగో విజయం. ఈ మ్యాచులో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అనంతరం 164 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

పర్వాలేదనిపించే స్కోరు

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత‌ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 163 ప‌రుగులు చేసింది. ఆర్సీబీ అద్బుత‌మైన ఆరంభం ల‌భించిన‌ప్ప‌టికి మిడిల్ ఓవ‌ర్ల‌లో బ్యాట‌ర్లు చేతులేత్తేశారు. ఆర్సీబీ బ్యాట‌ర్ల‌లో ఫిల్ సాల్ట్‌(37) ప‌రుగులతో మెరుపు ఆరంభం ఇవ్వగా..టిమ్ డేవిడ్‌(18 బంతుల్లో 32, 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆఖ‌రిలో మెరుపులు మెరిపించాడు. విరాట్ కోహ్లీ (22; 14 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. రజత్ పటీదార్ (25), కృనాల్ పాండ్య (18) పరుగులు చేశారు. దేవ్‌దత్ పడిక్కల్ (1), లివింగ్‌స్టన్ (4), జితేశ్‌ శర్మ (3) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. చివర్లో టిమ్ డేవిడ్ (37*; 20 బంతుల్లో 2 ఫోర్, 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ స్కోరు 150 దాటింది. ఢిల్లీ బౌలర్లలో విప్రాజ్ నిగమ్ 2, కుల్‌దీప్ యాదవ్ 2, ముకేశ్‌ కుమార్, మోహిత్ శర్మ చెరో వికెట్ పడగొట్టారు. వీరిద్ద‌రితో పాటు పాటిదార్(25), కోహ్లి(22) ప‌ర్వాలేద‌న్పించారు.

రాహుల్ ఒంటరి పోరాటం

ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో కేఎల్ రాహుల్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు.  60 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన ఢిల్లీ రాహుల్ త‌న క్లాసీ నాక్‌తో విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. 53 బంతులు ఎదుర్కొన్న రాహుల్‌..7 ఫోర్లు, 6 సిక్స్‌ల‌తో 93 ప‌రుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కేఎల్‌ రాహుల్‌ (93*; 53 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) చెలరేగడంతో లక్ష్యాన్ని దిల్లీ ట్రిస్టన్ స్టబ్స్‌ (38*; 23 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌) రాణించాడు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ 2, యశ్‌ దయాళ్‌, సుయాశ్‌ శర్మ ఒక్కో వికెట్‌ తీశారు.


Tags:    

Similar News