IPL: ప్లే ఆఫ్స్‌కు ముంబై ఇండియన్స్
ప్లే ఆఫ్స్‌ఉత్కంఠకు తెర... కీలక మ్యాచ్‌లో ముంబై గెలుపు.. అద్భుత ఇన్నింగ్స్‌ఆడిన సూర్య;
ఉత్కంఠకు తెరపడింది. ఐపీఎల్- 18 ప్లే ఆఫ్స్ రేసు ముగిసింది. ఇప్పటికే మూడు జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించగా... మిగిలిన ఆ ఒక్క బెర్తు ను ముంబై దక్కించుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించి. ప్లే ఆఫ్స్‌లో కి అడుగుపెట్టింది. సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టు కు మెరుగైన స్కోరునందిస్తే.. బౌలర్లు సమష్టి గా విజృంభించి ఢిల్లీ కథ ముగించారు. ఇక టాప్- 2లో నిలిచేదెవరన్న దానిపైనే ఉత్కంఠ నెలకొంది. సొంత మైదానంలో జరిగిన కీలక పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై పైచేయి సాధించింది. మరోవైపు వరుసగా నాలుగు విజయాలతో ఘనంగా సీజన్‌ను ప్రా రంభించినా... ఆపై గతి తప్పిన ఆటతో వరుస ఓటములు ఎదుర్కొన్న ఢిల్లీ క్యాపిటల్స్ ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది.
సూర్య ఒక్కడే..
ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్... నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టా నికి 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (73 నాటౌట్; 43 బంతుల్లో 7×4, 4×6) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. బంతి తక్కువ ఎత్తు లో వస్తూ నెమ్మదిగా ఉన్న పిచ్‌పై పరుగులు చేయడంలో ముంబై బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. రోహిత్ శర్మ (5) విఫలం కాగా... రికెల్టన్ (18 బంతుల్లో 25; 2 సిక్స్‌లు ), విల్ జాక్స్ (13 బంతుల్లో 21; 3 ఫోర్లు , 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. దాంతో పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 54 పరుగులకు చేరింది. కుల్దీ ప్ తన తొలి ఓవర్లో నే రికెల్టన్‌ను వెనక్కి పంపగా, తిలక్ వర్మ (27 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్) వేగంగా ఆడలేకపోయాడు. సూర్యకుమార్ బ్యాటింగ్‌లో కూడా తడబాటు కనిపించగా, హార్దిక్ పాండ్యా (3) కూడా ఎక్కువసేపు నిలవలేదు. 15వ ఓవర్లో తిలక్ ఔటయ్యే సమయానికి స్కోరు 113 పరుగులే. కెప్టెన్ హార్దిక్ (3) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 18 ఓవర్లకు ముంబయి 132/5తో నిలిచింది.
మొదట్లో తడబడ్డా...
సూర్య కూడా షాట్లు ఆడలేకపోతుండడంతో ముంబయి 160 చేస్తే ఎక్కువ అనిపించింది. కానీ ఆఖరి 2 ఓవర్లలో సూర్య, నమన్ ధీర్ (24 నాటౌట్; 8 బంతుల్లో 2×4, 2×6) చెలరేగిపోవడంతో 48 పరుగులొచ్చాయి. ముకేశ్ 19వ ఓవర్లో ఏకంగా 27 పరుగులు సమర్పించుకున్నాడు. చమీర వేసిన చివరి ఓవర్లో 21 పరుగులొచ్చాయి. దీంతో ముంబై 180 పరుగులు చేసింది.
ఢిల్లీ ఛేదనలో తడ"బ్యాటు"
181 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన ఆ జట్టు చాలా ముందుగానే ఓటమి ఖాయం చేసుకుంది. అక్షర్ పటేల్ జ్వరంతో బాధ పడుతుండడంతో ఈ మ్యాచ్‌లో డీసీకి నాయకత్వం వహించిన డుప్లెసిస్ (6).. దీపక్ చాహర్ వేసిన రెండో ఓవర్లో నే వెనుదిరిగాడు. గత మ్యాచ్ సెంచరీ హీరో కేఎల్ రాహుల్ (11) బౌల్ట్ వేసిన తర్వాతి ఓవర్లో నే ఔటైపోవడంతో ఢిల్లీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తర్వాత స్పిన్నర్ల మాయాజాలం మొదలైంది. ఒకే ఓవర్ వేసిన విల్ జాక్స్.. పోరెల్ (6) వికెట్‌ను ఖాతాలో వేసుకోగా.. ధాటిగా ఆడుతున్న విప్రా జ్ నిగమ్ (20)ను శాంట్నర్ ఔట్ చేశాడు. బుమ్రా కేవలం 12 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. మరొక్క మ్యాచ్ మాత్రమే మిగిలివున్న ఢిల్లీ ఆ పోటీలో నెగ్గినా 15 పాయింట్లే అవుతాయి. ఇక ఐదుసార్లు టైటిల్ గెల్చుకున్న ముంబై ప్లే ఆఫ్స్ చేరడం ఇది 11వసారి.