IPL: రాజస్థాన్‌పై బెంగళూరు ఏకపక్ష విజయం

173 పరుగులకే పరిమితమైన రాజస్థాన్‌... 17వ ఓవర్లలోనే ఛేదించిన బెంగళూరు;

Update: 2025-04-14 02:00 GMT

ఐపీఎల్‌ 2025లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు.. రాజస్థాన్‌ని నిర్ణీత 20 ఓవర్లకు 173 పరుగులకే కట్టడి చేసింది. జైస్వాల్ 75, దృవ్ 35, పరాగ్ 30 రాణించారు. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన RCB కేవలం ఒక వికెట్ కోల్పోయి 17 ఓవర్‌ల్లో మ్యాచ్ ఫినిష్ చేసింది.

జైస్వాల్ మినహా

ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ పర్వాలేదనిపించే స్కోరు చేసింది. ఓపెనర్‌ జైస్వాల్‌ అర్ధ శతకంతో ఆకట్టుకోగా.. జురెల్‌ ఫినిషింగ్‌ టచ్‌ ఇవ్వడంతో రాజస్థాన్‌ గౌరవప్రద స్కోరు చేసింది. ఆరు ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్‌ 45/0తో నిలిచింది. ఆ తర్వాతి ఓవర్‌లో క్రునాల్‌ బౌలింగ్‌లో శాంసన్‌ స్టంపౌట్‌ కావడంతో.. తొలి వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. వన్‌డౌన్‌లో వచ్చిన పరాగ్‌.. జైస్వాల్‌కు చక్కని సహకారం అందించాడు. జైస్వాల్‌ ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. ఆ తర్వాతి ఓవర్‌లో పరాగ్‌ను యశ్‌ అవుట్‌ చేసి దెబ్బకొట్టాడు. హాజెల్‌వుడ్‌ బౌలింగ్‌లో జైస్వాల్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ క్యాచ్‌వదిలేయడంతో బతికిపోయిన జురెల్‌.. తర్వాత ధాటిగా ఆడడంతో స్కోరు 170 మార్క్‌ దాటింది. రాజస్థాన్‌ని నిర్ణీత 20 ఓవర్లకు 173 పరుగులకే పరిమితమైంది.

సాల్ట్ దంచేశాడు

174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు సునాయసంగానే గెలిచింది. ఫిల్‌ సాల్ట్‌ (33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 65), కోహ్లీ (45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62 నాటౌట్‌) అర్ధ శతకాలతో చెలరేగడంతో.. బెంగళూరు ఘన విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరు 9 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను చిత్తు చేసింది. ఓపెనర్‌ కోహ్లీతో కలసి సాల్ట్‌ తొలి వికెట్‌కు 52 బంతుల్లో 92 పరుగులు జోడించడంతో.. బెంగళూరు అలవోకగా గెలిచింది. పడిక్కల్‌తో కలసి కోహ్లీ రెండో వికెట్‌కు అజేయంగా 83 పరుగులు జోడించడంతో.. బెంగళూరు మరో 15 బంతులు మిగిలుండగానే ఘన విజయం సాధించింది.

Tags:    

Similar News