IPL: అరెంజ్‌.. పర్పుల్‌ క్యాప్‌లు వారివే

ఈ టోర్నమెంట్‌లో అత్యంత విలువైన ఆటగాడు సునీల్‌ నరైన్‌...ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సీజన్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి..;

Update: 2024-05-27 01:00 GMT

ఐపీఎల్‌-17 ఛాంపియన్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచింది. ముచ్చటగా........ మూడోసారి ఐపీఎల్‌ విజేతగా కోల్‌కతా నిలిచింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో కోల్‌కతా కప్పును ముద్దాడింది. హైదరాబాద్ అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. చెన్నై చిదంబరం స్టేడియంలో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. మాజీ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన సన్‌రైజన్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. కేకేఆర్ టీమ్ ఆడుతూపాడుతూ కేవలం 10.3 ఓవర్లలోనే మ్యాచ్ ముగించి, మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. మరోవైపు ఐపీఎల్ చరిత్రలో ఫైనల్లో అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా హైదరాబాద్ టీమ్ నిలిచింది. ఐపీఎల్ సీజన్ 17 విజేత కేకేఆర్‌కు బీసీసీఐ కార్యదర్శి జై షా ట్రోఫీ అందజేశారు.

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఇలా..

విజేత : కోల్‌కతా నైట్‌రైడర్స్

రన్నరప్‌ : సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

మూడో స్థానంలో నిలిచిన జట్టు : రాజస్థాన్‌ రాయల్స్‌

నాలుగో స్థానంలో నిలిచిన జట్టు : రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు

ఈ సీజన్‌ అత్యుత్తమ వేదిక : ఉప్పల్‌, హైదరాబాద్‌

ఐపీఎల్‌ ఫెయిర్‌ప్లే అవార్డు : సన్‌రైజర్స్ హైదరాబాద్‌

ఆరెంజ్‌ క్యాప్‌ : విరాట్‌ కోహ్లీ( బెంగళూరు) 741 పరుగులు

పర్పుల్‌ క్యాప్‌ : హర్షల్‌ పటేల్‌ (పంజాబ్‌ ) 24వికెట్లు

సూపర్‌ స్ట్రైకర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ : జేక్‌ ఫ్రేజర్‌ మెకెర్క్‌(దిల్లీ) 234.04

ఎక్కువ ఫోర్లు కొట్టిన ఆటగాడు : ట్రావిస్‌ హెడ్‌ (హైదరాబాద్‌) 64 ఫోర్లు

ఎక్కువ సిక్స్‌లు కొట్టిన ఆటగాడు: అభిషేక్‌ శర్మ (హైదరాబాద్‌) 42 సిక్స్‌లు

ఈ టోర్నమెంట్‌లో అత్యంత విలువైన ఆటగాడు : సునీల్‌ నరైన్‌ (కోల్‌కతా)

లాంగెస్ట్‌ సిక్స్‌ : ధోని (110 మీటర్లు)

క్యాచ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ : రమణ్‌దీప్‌ సింగ్‌ (కోల్‌కతా)

ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సీజన్‌ : నితీశ్‌ కుమార్‌ రెడ్డి (హైదరాబాద్‌)

Tags:    

Similar News