IPL: విదేశాల్లోనే ఐపీఎల్ మినీ వేలం

ఐపీఎల్ 2026 సన్నాహాలు ఆరంభం... ముగిసిన ఆటగాళ్ల రిటెన్షన్ గడువు... డిసెంబర్‌ 16న అబుదాబిలో మినీ వేలం

Update: 2025-11-17 05:30 GMT

ఐపీ­ఎ­ల్ రి­టె­న్ష­న్ ప్ర­క్రియ పూ­ర్త­య్యాక, ఇప్పు­డు అం­ద­రి దృ­ష్టి వెం­ట­నే రా­బో­యే మినీ వే­లం­పై­నే ని­లి­చిం­ది. డి­సెం­బ­ర్ 16న అబు­దా­బీ­లో జర­గ­బో­యే ఈ వే­లా­ని­కి ఫ్రాం­చై­జీ­లు సి­ద్ధ­మ­వు­తు­న్నా­యి. 19వ సీ­జ­న్ కోసం పది జట్లు మొ­త్తం 173 మం­ది­ని తమ స్క్వా­డ్‌­లో ఉం­చు­కు­న్నా­యి. వీ­రి­లో 49 మంది వి­దే­శీ ఆట­గా­ళ్లు. ఈసా­రి ముం­బ­యి ఇం­డి­య­న్స్, గు­జ­రా­త్ టై­టా­న్స్ ఎక్కువ సం­ఖ్య­లో ప్లే­య­ర్ల­ను కొ­న­సా­గిం­చ­డం­తో, వే­లం­లో కే­వ­లం 77 మంది మా­త్ర­మే అమ్ము­డ­య్యే అవ­కా­శం కని­పి­స్తోం­ది. ఐపీ­ఎ­ల్ లో ఏ ఫ్రాం­చై­జీ అయి­నా కూడా.. తమ జట్టు­ను బలో­పే­తం చే­సు­కో­వా­ల­ని చూ­స్తుం­టా­యి. అం­దు­కు తగ్గ­ట్టు­గా­నే భా­రీ­గా ధరను వె­చ్చిం­చి మరీ కొ­ను­గో­లు చే­స్తుం­టా­యి. కొ­ను­గో­లు చే­సిన ప్లే­య­ర్స్ కొం­ద­రు ని­రా­శ­ప­ర­చ­డం­తో మళ్లీ వా­రి­కి ఉద్వా­సన పల­కా­ల్సి వస్తుం­ది.

విదేశాల్లోనే వేలం

గత రెం­డే­ళ్లు­గా వి­దే­శా­ల్లో జరు­గు­తు­న్న ఈ వే­లా­న్ని ఈ సారి స్వ­దే­శం­లో ని­ర్వ­హిం­చ­ను­న్న­ట్లు వా­ర్త­లు వచ్చా­యి. ఈ నే­ప­థ్యం­లో తా­జా­గా ఐపీ­ఎ­ల్ మినీ వేలం ఎక్కడ, ఎప్పు­డు జరు­గు­తుం­ద­నే దా­ని­పై బీ­సీ­సీఐ అధి­కా­రిక ప్ర­క­టన చే­సిం­ది. ఐపీ­ఎ­ల్ 2026 మినీ వేలం ఈ సారి కూడా వి­దే­శా­ల్లో­నే జర­గ­ను­న్న­ట్లు బీ­సీ­సీఐ వె­ల్ల­డిం­చిం­ది. డి­సెం­బ­ర్ 16న అబు­దా­బి­లో ఈ టో­ర్నీ­కి సం­బం­ధిం­చిన వేలం జరు­గు­తుం­ద­ని తె­లి­పిం­ది. అయి­తే వి­దే­శా­ల్లో వేలం ని­ర్వ­హిం­చ­డం ఇది మూడో ఏడా­ది. 2023లో దు­బా­య్, 2024లో సౌదీ అరే­బి­యా­లో­ని జె­డ్డా­లో వేలం వే­శా­రు. డేం­జ­రె­స్ ప్లే­య­ర్ ఆం­డ్రీ రసె­ల్‌­ను కే­కే­ఆ­ర్ ఫ్రాం­చై­జీ రి­లీ­జ్ చే­సిం­ది. ఆల్‌­రౌం­డ­ర్‌­గా రసె­ల్ కే­కే­ఆ­ర్ జట్టు తర­ఫున అద్భుత ప్ర­ద­ర్శన చే­స్తూ వచ్చా­డు.

టాప్ 5 ప్లేయర్స్ వీరే

ఈ టాప్ 5 ప్లే­య­ర్స్ రి­లీ­జ్ లి­స్టు మి­మ్మ­ల్ని కొం­చెం ఆశ్చ­ర్య­ప­రు­స్తుం­ది.! ఎం­దు­కం­టే ఎన్నో ఏళ్లు­గా జట్టు­కు మ్యా­చ్ వి­న్న­ర్ గా ని­లి­చిన ఓ ప్లే­య­ర్ కూడా ఇం­దు­లో ఉన్నా­డు. అతడు మరె­వ­రో కాదు ఆం­డ్రీ రస్సె­ల్. కే­కే­ఆ­ర్ మ్యా­చ్ వి­న్న­ర్ అయిన రస్సె­ల్ ఈసా­రి మినీ వే­లం­లో­కి రా­ను­న్నా­డు. 2025 మెగా వే­లా­ని­కి ముం­దు­గా కే­కే­ఆ­ర్.. రస్సె­ల్ ను రూ. 12 కో­ట్లు ఇచ్చి అట్టి­పె­ట్టు­కుం­ది. అయి­తే ఈసా­రి ఆ జట్టు అత­డ్ని అనూ­హ్యం­గా రి­లీ­జ్ చే­సిం­ది. గత సీ­జ­న్‌­లో అత్య­ధిక డబ్బు పె­ట్టి కొ­ను­గో­లు చే­సిన బ్యా­ట­ర్ వెం­క­టే­శ్ అయ్య­ర్(రూ.23.75కో­ట్లు)ను కూడా కే­కే­ఆ­ర్ వది­లే­సిం­ది. చె­న్నై సూ­ప­ర్ కిం­గ్స్ జట్టు తర­ఫున సూ­ప­ర్ బౌ­లిం­గ్ చే­స్తూ వి­జ­యం­లో కీలక పా­త్ర పో­షిం­చే మహి­శా పతి­ర­ణా­ను కూడా ఆ జట్టు రి­లీ­జ్ చే­సిం­ది. ఆస్ట్రే­లి­య­న్ పవర్ హి­ట్ట­ర్ మా­క్స్‌­వె­ల్‌­ను పం­జా­బ్ కిం­గ్స్ వి­డు­దల చే­సిం­ది. వే­లం­లో మొ­త్తం జట్లు కలి­పి సు­మా­రు రూ.237.55 కో­ట్లు వె­చ్చిం­చ­ను­న్నా­యి. ఇం­దు­లో కో­ల్‌­క­తా నైట్ రై­డ­ర్స్ అత్య­ధి­కం­గా రూ.64.3 కో­ట్ల పర్స్‌­తో ముం­దుం­ది. కే­కే­ఆ­ర్ మొ­త్తం 13 మంది ప్లే­య­ర్ల­ను తీ­సు­కు­నే ప్లా­న్ చే­స్తోం­ది, అం­దు­లో ఆరు­గు­రు వి­దే­శీ ప్లే­య­ర్లు ఉం­డొ­చ్చు. రెం­డో పె­ద్ద బడ్జె­ట్ చె­న్నై సూ­ప­ర్ కిం­గ్స్‌­దే — వారు రూ.43.4 కో­ట్ల­తో వే­లం­లో ది­గు­తు­న్నా­రు. ముం­బై ఇం­డి­య­న్స్ పర్స్‌­లో రూ.2.75 కో­ట్లు మా­త్ర­మే మి­గి­లా­యి. పం­జా­బ్ కిం­గ్స్ వద్ద రూ.11.5 కో­ట్లు ఉన్నా­యి.

Tags:    

Similar News