IPL: ఐపీఎల్‌ రిటెన్షన్ ప్రక్రియ పూర్తి

ఐపీఎల్ చరిత్రలో భారీ ట్రేడ్ డీల్ పూర్తి.. అధికారికంగా ధ్రువీకరించిన ఐపీఎల్

Update: 2025-11-16 03:30 GMT

ఐపీఎల్ క్రికెట్ లవర్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 రిటెన్షన్ జాబితా వచ్చేసింది. డిసెంబరు 15 వ తేదీన అబుదాబిలో మినీ వేలం జరగనుంది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం రిటైన్, రిలీజ్ చేసే ఆటగాళ్ల వివరాలను అన్ని జట్ల ప్రాంఛైజీలు ప్రకటించాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) నుంచి అభినవ్ మనోహర్, అథ్వర తైడే, సచిన్ బేబీ, వియాన్ ముల్డర్, షమీ, సిమర్‌జిత్ సింగ్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపాను వదులుకుంది. కేకేఆర్ నుంచి ఆండ్రూ రస్సెల్, వెంకటేశ్ అయ్యార్, డికాక్ లాంటి స్టార్లను రిలీజ్ చేసింది.

చెన్నైలోకి సంజూ శాంసన్

ఐపీ­ఎ­ల్‌ 2026కు ముం­దు ఆయా ఫ్రాం­ఛై­జీల మధ్య జరి­గిన ట్రే­డ్‌ అభి­మా­ను­ల్లో ఆస­క్తి రే­పు­తోం­ది. తా­జా­గా ఎని­మి­ది మంది ఆట­గా­ళ్ల ట్రే­డ్‌ పూ­ర్త­యి­న­ట్టు ఐపీ­ఎ­ల్‌ ధ్రు­వీ­క­రిం­చిం­ది. ముం­దు­నుం­చి వా­ర్త­లు వస్తు­న్న­ట్లు­గా­నే రవీం­ద్ర­జ­డే­జా, సా­మ్‌­క­ర­ణ్‌ రా­జ­స్థా­న్‌ రా­య­ల్స్‌ గూ­టి­కి, సం­జు­శాం­స­న్‌ చె­న్నై సూ­ప­ర్‌ కిం­గ్స్‌ జట్టు­లో­కి వచ్చా­రు. మహ్మ­ద్‌ షమీ.. సన్‌­రై­జ­ర్స్‌ హై­ద­రా­బా­ద్‌ నుం­చి లఖ్‌­న­వూ సూ­ప­ర్‌ జె­యిం­ట్స్‌­కు మా­రా­డు. సచి­న్‌ తెం­దూ­ల్క­ర్‌ కు­మా­రు­డు అర్జు­న్‌ తెం­దూ­ల్క­ర్‌ ముం­బ­యి ఇం­డి­య­న్స్‌ నుం­చి లఖ్‌­న­వూ జట్టు­లో­కి వచ్చా­డు. మయాం­క్‌ మా­ర్కం­డే కో­ల్‌­క­తా నై­ట్‌ రై­డ­ర్స్‌ జట్టు నుం­చి ముం­బ­యి టీ­మ్‌­లో­కి వచ్చా­డు. ని­తీ­శ్‌ రాణా రా­జ­స్థా­న్‌ రా­య­ల్స్‌ నుం­చి ఢిల్లీ క్యా­పి­ట­ల్స్‌­కు, డో­నో­వ­న్ ఫె­రీ­రా ది­ల్లీ క్యా­పి­ట­ల్స్‌ నుం­చి రా­జ­స్థా­న్‌ రా­య­ల్స్‌ జట్టు­లో­కి వచ్చా­రు.

 సంజూ కోసం విశ్వ ప్రయత్నం

అను­కు­న్న­ట్టు­గా­నే ఐపీ­ఎ­ల్ 2026 సీ­జ­న్‌­లో సంజూ శాం­స­న్, చె­న్నై సూ­ప­ర్ కిం­గ్స్ టీ­మ్‌­కి ఆడ­బో­తు­న్నా­డు. అత­న్ని సీ­ఎ­స్‌­కే టీ­మ్‌­కి ఇచ్చిన రా­జ­స్థా­న్ రా­య­ల్స్, బదు­లు­గా సీ­ని­య­ర్ ఆల్‌­రౌం­డ­ర్ రవీం­ద్ర జడే­జా­ని టీ­మ్‌­లో­కి తె­చ్చు­కుం­ది. చె­న్నై సూ­ప­ర్ కిం­గ్స్ తరు­పున 12 సీ­జ­న్లు ఆడిన రవీం­ద్ర జడే­జా­కి ఐపీ­ఎ­ల్ 2025 సీ­జ­న్‌­లో రూ.18 కో­ట్ల­తో రి­టె­న్ష­న్ దక్కిం­ది. అయి­తే దా­న్ని రూ.14 కో­ట్ల­కు తగ్గిం­చి, ట్రే­డ్ చే­సు­కుం­ది రా­జ­స్థా­న్ రా­య­ల్స్. ఐపీ­ఎ­ల్ 2026 సీ­జ­న్‌­లో రవీం­ద్ర జడే­జా రూ.14 కో­ట్లు అం­దు­కో­బో­తు­న్నా­డు. అలా­గే ఆల్‌­రౌం­డ­ర్ సామ్ కర్ర­న్ కూడా చె­న్నై సూ­ప­ర్ కిం­గ్స్‌ నుం­చి రా­జ­స్థా­న్ రా­య­ల్స్‌­లో­కి వె­ళ్ల­బో­తు­న్నా­డు. అత­న్ని రూ.2.4 కో­ట్ల ప్ర­స్తుత ధరకే ట్రే­డ్ చే­సు­కుం­ది రా­జ­స్థా­న్ రా­య­ల్స్.  చె­న్నై సూ­ప­ర్ కిం­గ్స్ కె­ప్టె­న్, వి­కె­ట్ కీ­ప­ర్ ఎమ్మె­స్ ధోనీ, ఐపీ­ఎ­ల్ రి­టై­ర్మెం­ట్ ఖాయం కా­వ­డం­తో తన ప్లే­స్‌­ని రి­ప్లే­స్ చే­య­గల సత్తా ఉన్న వి­కె­ట్ కీ­పిం­గ్ బ్యా­ట­ర్ కోసం చూ­సిన చె­న్నై సూ­ప­ర్ కిం­గ్స్, సంజూ శాం­స­న్ కోసం వి­శ్వ ప్ర­య­త్నా­లు చే­సిం­ది.

చెన్నైసూపర్ కింగ్స్ (సీఎస్‌కే) నుంచి మతిశా పతిరన, రాహుల్ త్రిపాఠి, వన్ష్‌ బేడి, ఆండ్రీ సిద్ధార్థ్‌, రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, విజయ్ శంకర్, షేక్ రషీద్, కమలేశ్‌‌లు ఉన్నారు. ముంబయి ఇండియన్స్ సత్యనారాయణ రాజు, రీస్ టాప్లీ, కేఎల్ షీర్జిత్, కర్ణ్‌ శర్మ, బెవాన్ జాకబ్స్, ముజీబుర్ రెహ్మన్, లిజాడ్ విలియమ్స్, విజ్ఞేశ్ పుతుర్‌లను రిలీజ్ చేశారు. పంజాబ్ నుంచి 5 గురు ప్లేయర్స్ ఉన్నారు. ఆర్సీబీ నుంచి 8 , ఢిల్లీ నుంచి డుప్లెసిస్ లాంటి కీలక ఆటగాళ్లను రిలీజ్ చేశారు. గుజరాత్ టైటాన్స్ నుంచి ఐదుగురు, లఖ్‌నవూ నుంచి డేవిడ్ మిల్లర్‌తో పాటు 6 గురుని రిలీజ్ చేశారు. రాజస్థాన్ జట్టు నుంచి 7 మంది ప్లేయర్‌లు రీలీజ్ అయ్యారు.

Tags:    

Similar News