IPL: ఒకటి కాదు..రెండు ఐపీఎల్ జట్లు అమ్మకానికి

అమ్మకానికి రెండు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు.. ఆర్సీబీతో పాటు ఆర్‌ఆర్‌ కూడా విక్రయం..క్రికెట్‌ ప్రపంచంలో మరో సంచలనం

Update: 2025-11-28 13:32 GMT

ఇం­డి­య­న్ ప్రీ­మి­య­ర్ లీగ్ (ఐపీ­ఎ­ల్) వచ్చే సీ­జ­న్‌­కు ముం­దు కీలక పరి­ణా­మా­లు చో­టు­చే­సు­కుం­టు­న్నా­యి. ఇప్ప­టి­కే రా­య­ల్ ఛా­లెం­జ­ర్స్ బెం­గ­ళూ­రు  ఫ్రాం­ఛై­జీ అమ్మ­కా­ని­కి సి­ద్ధ­మై­న­ట్లు ప్ర­క­టిం­చ­గా, తా­జా­గా ఈ జా­బి­తా­లో­కి రా­జ­స్థా­న్ రా­య­ల్స్  కూడా చే­రి­న­ట్లు తె­లు­స్తోం­ది. ప్ర­ముఖ పా­రి­శ్రా­మి­క­వే­త్త హర్ష్ గొ­యెం­కా చే­సిన ఒక సో­ష­ల్ మీ­డి­యా పో­స్ట్ ఈ వా­ర్త­ల­కు బలా­న్ని­చ్చిం­ది. "ఒకటి కాదు.. రెం­డు ఐపీ­ఎ­ల్ జట్లు అమ్మ­కా­ని­కి ఉన్నా­యి. అవే ఆర్సీ­బీ, రా­జ­స్థా­న్ రా­య­ల్స్. వీ­టి­ని దక్కిం­చు­కు­నేం­దు­కు నలు­గు­రై­దు­గు­రు కొ­ను­గో­లు­దా­రు­లు రే­సు­లో ఉన్నా­రు. పూణె, అహ్మ­దా­బా­ద్, ముం­బ­యి, బెం­గ­ళూ­రు, యూ­ఎ­స్‌ఏ నుం­చి కొ­త్త యజ­మా­ను­లు వస్తా­రే­మో చూ­డా­లి!" అని హర్ష్ గొ­యెం­కా తన ‘ఎక్స్‌’ ఖా­తా­లో పే­ర్కొ­న్నా­రు. ఈ పో­స్ట్ ప్ర­స్తు­తం వై­ర­ల్‌­గా మారి, క్రి­కె­ట్ వర్గా­ల్లో తీ­వ్ర చర్చ­కు దా­రి­తీ­సిం­ది. ప్ర­స్తు­తం రా­జ­స్థా­న్ రా­య­ల్స్ జట్టు­లో రా­య­ల్స్ స్పో­ర్ట్స్ గ్రూ­ప్‌­కు 65 శాతం వాటా ఉంది. ఇది­లా ఉం­డ­గా, ఆర్సీ­బీ యా­జ­మా­న్య సం­స్థ డి­యా­జి­యో ఇప్ప­టి­కే ఫ్రాం­ఛై­జీ వి­క్రయ ప్ర­క్రి­య­ను అధి­కా­రి­కం­గా ప్రా­రం­భిం­చిం­ది. ఈ వి­ష­యా­న్ని బాం­బే స్టా­క్ ఎక్స్ఛేం­జ్‌­కు కూడా తె­లి­య­జే­సిం­ది. వచ్చే ఏడా­ది మా­ర్చి 31 నా­టి­కి ఈ ప్ర­క్రి­య­ను పూ­ర్తి చే­యా­ల­ని లక్ష్యం­గా పె­ట్టు­కుం­ది. ఆర్సీ­బీ­ని కొ­ను­గో­లు చే­సేం­దు­కు ప్ర­ముఖ పా­రి­శ్రా­మి­క­వే­త్త అదర్ పూ­నా­వా­లా­తో పాటు మరో రెం­డు సం­స్థ­లు ఆస­క్తి చూ­పు­తు­న్న­ట్లు సమా­చా­రం. ఈ పరి­ణా­మా­ల­తో వచ్చే ఐపీ­ఎ­ల్ సీ­జ­న్‌­లో ఈ రెం­డు జట్లు కొ­త్త యా­జ­మా­న్యాల చే­తి­కి వె­ళ్లే అవ­కా­శా­లు కని­పి­స్తు­న్నా­యి. ఇప్ప­టి­కే ఐపీ­ఎ­ల్ 2025 ఛాం­పి­య­న్ రా­య­ల్ ఛా­లెం­జ­ర్స్ బెం­గ­ళూ­రు(ఆర్‌­సీ­బీ) అమ్మ­కా­ని­కి సి­ద్దం­గా ఉన్న­ట్లు వా­ర్త­లు వచ్చా­యి. ఆర్‌­సీ­బీ­ని హోం­బా­లే ఫి­ల్మ్స్ ప్రొ­డ­క్ష­న్ హౌస్ కొ­ను­గో­లు చే­స్తుం­ద­ని, డీల్ కూడా పూ­ర్త­యిం­ద­ని వా­ర్త­లు వచ్చా­యి. కానీ ఈ వ్య­వ­హా­రం­పై ఆర్‌­సీ­బీ ఫ్రాం­చై­జీ ఎలాం­టి అధి­కా­రిక ప్ర­క­టన చే­య­లే­దు.

ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే..

ఆర్‌­సీ­బీ ఫ్రాం­చై­జీ­కి ప్ర­స్తు­తం డి­యా­జి­యో ఇం­డి­యా యజ­మా­ని­గా ఉంది. ఐపీ­ఎ­ల్ 2025 సీ­జ­న్ ము­గి­సిన వెం­ట­నే ఆర్‌­సీ­బీ ఫ్రాం­చై­జీ­ని డి­యా­జి­యో అమ్మ­కా­ని­కి పె­ట్టి­న­ట్లు వా­ర్త­లు వచ్చా­యి. ఫ్రాం­చై­జీ వి­లువ సు­మా­రు­గా 2 బి­లి­య­న్ల అమె­రి­కా డా­ల­ర్లు­గా(రూ.17000 కో­ట్లు) ఉం­టుం­ద­ని అం­చ­నా. డి­యా­జి­యో కం­పె­నీ ప్ర­ధాన వ్యా­పా­రం మద్యం. డి­యా­జి­యో­కు అమె­రి­కా అతి­పె­ద్ద మా­ర్కె­ట్. అయి­తే అక్కడ సుం­కా­లు పె­ర­గ­డం, వి­ని­యో­గ­దా­రుల తగ్గ­డం­తో ప్రీ­మి­యం మద్యం అమ్మ­కా­ల­పై ప్ర­భా­వం పడిం­ది. దాం­తో ఆ సం­స్థ..ఆర్థిక ఇబ్బం­దు­ల­ను ఎదు­ర్కొం­టుం­ది. ఈ క్ర­మం­లో­నే ఆర్‌­సీ­బీ ఫ్రాం­చై­జీ­ని అమ్మ­డం ద్వా­రా వచ్చే డబ్బు­ల­ను ప్ర­ధాన వ్యా­పా­రం­పై పె­ట్టా­ల­నే యో­చ­న­లో డి­యా­జి­యో ఉన్న­ట్లు తె­లు­స్తోం­ది.

Tags:    

Similar News