IPL: క్రికెట్ ప్రపంచంలో అంతా వైభవ్ నామస్మరణే
వైభవ్‌కు కోహ్లీ ప్రత్యేక నోట్... అద్భుతమన్న భువనేశ్వర్
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ సూర్యవంశీకి తనదైన “మ్యాజిక్ బ్యాట్” గుర్తింపు లభించింది. అది విరాట్ కోహ్లీ నుండి. పవర్‌ప్లేలో భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లను ఎదుర్కొంటున్నందున, ఆ కుర్రాడు చాలా జాగ్రత్తగా ఆడతాడని చాలామంది ఊహించారు. అలా కాకుండా, అతను దాడికి దిగాడు. సూర్యవంశీ ఇద్దరు సీనియర్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. ఆ యువ ఆటగాడు ఆటను పూర్తిగా తలకిందులు చేయడంతో, వారు ఒత్తిడికి లోనైనట్లు కనిపించారు. ఈ పరిణామాలను దగ్గర నుండి చూస్తున్న కోహ్లీ వెలువడుతున్న ప్రకటనను విస్మరించలేకపోయాడు. మ్యాచ్ తర్వాత అద్భుతమైన అనుభవం ఎదురైంది. సూర్యవంశీ ఆటోగ్రాఫ్ కోసం కోహ్లీని కలిశాడు. అతడు కేవలం సంతకంతోనే సరిపెట్టలేదు. "ప్రియమైన వైభవ్, బాగా చేసావు," అని కోహ్లీ రాయల్స్ క్యాప్‌పై రాశాడు — ఇది ఒక సాధారణ సందేశమే అయినా, ఆటలోని గొప్ప ఆటగాళ్లలో ఒకరి నుండి వస్తున్నందున తన బాధ్యతను మరింత పెంచినట్లైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కష్టంగా కనిపించింది. సూర్యవంశీ మెరుపుదాడితో ఆర్సీబీ ఓడిపోయింది.
" వైభవ్ ఓ తుఫాన్ "
వైభవ్ సూర్యవంశీ దెబ్బకు ఆర్సీబీ స్టార్ బౌలింగ్ యూనిట్ కుదేలైంది. 200+ లక్ష్యాన్ని 18 ఓవర్లలోనే పూర్తి చేసిన రాజస్థాన్ రాయల్స్ నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తమ ఓటమికి ప్రధాన కారణం వైభవ్ సూర్యవంశీ దూకుడునేనని ఆర్సీబీ ప్రధాన బౌలర్ భువనేశ్వర్ కుమార్ మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు. ‘‘టీ20 అంటే ఇలాగే ఉంటుంది. వైభవ్ సూర్యవంశీ కుర్రాడు. అద్భుతంగా ఆడాడు. చాలా పరిణతి చూపించాడు. కానీ, మా బౌలింగ్‌ను చితక్కొడుతున్నాడని మేం అనుకోలేదు. ఒక 15 ఏళ్ల కుర్రాడు ఈవిధంగా బ్యాటింగ్ చేయడమంటే అద్భుతమే. అతడికి 25 ఏళ్లా 15 ఏళ్లా అని కాదుగానీ.. టీ20 ఆటలో ఇదంతా భాగమేనని భావిస్తా. ఇక్కడ ఎవరినీ తక్కువగా అంచనా వేయం. మ్యాచ్‌లో గెలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకొని బరిలోకి దిగాం. కానీ, క్యాచ్‌లు జారవిడిచాం. గేమ్‌లో ఉంటే మరోలా అనిపిస్తుంది. ఫాస్ట్ బౌలింగ్‌లోనూ వైభవ్ మంచి షాట్లు కొట్టాడు. పవర్ ప్లేలో స్పిన్నర్లతో బౌలింగ్ చేయించడం ఇబ్బందే. మాకు ఒకేఒక్క లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నారు. సుయాశ్ రూపంలో ఇంపాక్ట్‌ను తీసుకొనే అవకాశం లేకుండా పోయింది. మాకు ఆఫ్ స్పిన్నర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఎడమచేతివాటం బ్యాటర్లను కట్టడి చేసే అవకాశం వారికి ఉంటుంది. ఇదంతా ఒకెత్తు అయితే.. వైభవ్ బ్యాటింగ్‌ను తక్కువ చేయడానికి లేదు. నాణ్యమైన క్రికెటింగ్ షాట్లు కొట్టాడు. పదిహేనేళ్లకే ఇలాంటి ప్రదర్శన చేయడం తేలికైన విషయం కాదు. రాజస్థాన్ విజయంలో క్రెడిట్ అంతా వైభవ్ సూర్యవంశీదే. వైభవ్ భవిష్యత్తులో రాటుదేలుతాడు’’ అని భువి తెలిపాడు.