Karnam Malleswari : మీరాభాయి చానుపై కరణం మల్లీశ్వరి ప్రశంసల జల్లు..!
టోక్యో ఒలంపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్‌కి మొదటి పతాకాన్ని అందించిన మీరాబాయి చాను పైన కరణం మల్లీశ్వరి ప్రశంసల జల్లు కురిపించింది.;
టోక్యో ఒలంపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్‌కి మొదటి పతాకాన్ని అందించిన మీరాబాయి చాను పైన కరణం మల్లీశ్వరి ప్రశంసల జల్లు కురిపించింది. వెయిట్ లిఫ్టింగ్‌లోకి రావలనుకునేవారికి ఇది మంచి ప్రోత్సాహమని, మీరాను ఆదర్శంగా తీసుకుని మరింత మంది క్రీడాకారులు వెలుగులోకి వస్తారని తెలిపింది. మిగతా క్రీడాకారులు కూడా ఉత్తమ ప్రదర్శనతో పతకాలు సాధించాలని పేర్కొంది. కేంద్రం కూడా క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సాహిస్తుందని, మౌలిక సదుపాయాలు పెంచితే ఇంకా ఎక్కువ పతకాలు గెలుస్తారని ఆమె వెల్లడించారు. 46 ఏళ్ల మల్లేశ్వరి ప్రస్తుతం ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌గా ఉన్నారు.