ఈ ఏడాది అక్టోబర్‌లో టీమిండియా స్వదేశంలో.. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 2న అహ్మదాబాద్ లో ప్రారంభమవుతుంది. ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ లో కరుణ్ నాయర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం వల్ల అతనిపై వేటు పడే అవకాశం ఉందని మాజీలు అంచనా వేస్తున్నారు. భారత పిచ్ లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి కాబట్టి, జట్టులో అదనపు స్పిన్నర్ గా అక్షర్ పటేల్ ను తీసుకునే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకున్న రిషబ్ పంత్ ఈ సిరీస్‌తో జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈ సిరీస్ ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025-27 సైకిల్లో భాగంగా జరుగుతుంది. 2025లో టీమిండియా ఆడే చివరి టెస్ట్ సిరీస్ ఇదే కావడం గమనార్హం. ఆసియా కప్ ముగిసిన నాలుగో రోజుల వ్యవధిలోనే భారత్.. వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. మొదటి టెస్ట్: అక్టోబర్ 2 – అక్టోబర్ 6 అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. రెండో టెస్ట్: అక్టోబర్ 10 – అక్టోబర్ 14, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది.
ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్ లో టీమిండియా బ్యాటర్లు అద్భుతం రాణించారు. గిల్ 754 పరుగులతో సిరీస్‌లోనే టాప్ స్కోరర్‌గా నిలువగా, ఓపెనర్ కేఎల్ రాహుల్ 532 పరుగులతో ఆకట్టుకున్నారు. ఇక సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా సత్తా చాటాడు. బ్యాటింగ్‌లో 516 పరుగులు బాదిన జడ్డూ, బౌలింగ్‌లో 7 వికెట్లు తీసి రాణించాడు. రిషభ్ పంత్ 479 రన్స్ చేయగా, యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 411 విలువైన పరుగులు చేశాడు.