KHO KHO WC: తిరుగులేని భారత్‌

ఖో ఖో ప్రపంచ కప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన ఇండియా... గ్రూప్ దశలో వరుసగా నాలుగో విజయం;

Update: 2025-01-17 03:30 GMT

ఖో ఖో ప్రపంచ కప్‌లో భారత్‌ విజయాలతో అదరగొడుతోంది. పురుషులు, మహిళల జట్లు ఇప్పటికే క్వార్టర్‌ ఫైనల్లో చోటు దక్కించుకోగా.. విజయాలతో గ్రూపు మ్యాచ్‌లను ముగించాయి. భూటాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పురుషుల జట్టు 71-34 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఈరోజు(శుక్రవారం) శ్రీలంకతో ప్లే ఆఫ్‌లో తలపడనుంది. అటు మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో మహిళల జట్టు జయకేతనం ఎగుర వేయగా.. నేడు బంగ్లాతో క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది.


అద్భుతం చేసిన భారత జట్టు

టాస్ గెలిచిన భారత పురుషుల జట్టు మ్యాచ్ ప్రారంభంలోనే ఎదురుదాడి ప్రారంభించింది. ప్రత్యర్థి జట్టు డిఫెండర్లను పట్టుకోవడంతో ఆతిథ్య జట్టు అద్భుతాలు చేసింది. దీంతో భూటాన్ ఓటమి దిశగా ప్రయాణించింది. టర్న్ 1 చివరిలో భారత్ 32 పాయింట్లు సాధించింది. టర్న్ 2లో భూటాన్ ప్లేయర్ పోరాటం చేసారు... భారత్‌కు గట్టి పోటీనిచ్చారు. అయితే భారత డిఫెండర్లు దృఢంగా నిలిచి భూటాన్ ఆధిక్యంలోకి రాకుండా అడ్డుకున్నారు. టర్న్ 2 చివరిలో భూటాన్ పై భారత్ 32-18తో ముందంజలో ఉంది. మొదటి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్ 14 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. రెండో అర్ధభాగం ప్రారంభంలో అంటే టర్న్ 3లో భారత్ తమ దాడిని పునఃప్రారంభించింది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే కొంచెం మెరుగ్గా రాణించింది. టర్న్ 3 చివరిలో భారత్ అదనంగా 36 పాయింట్లు సాధించి తమ ఆధిక్యాన్ని 52 పాయింట్లకు పెంచుకుంది. ఇలా స్కోరు 70-18కు చేరింది.

వరుసగా నాలుగో విజయం

టర్న్ 4లో భూటాన్ ఎదురుదాడికి ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. రెండో అర్ధభాగం కూడా పూర్తయ్యే సమయానికి భారత్ తన ఆధిక్యాన్ని 39 పాయింట్లకు పెంచుకుంది. ఇలా తుది స్కోరు 71-34గా వుంది. భూటాన్‌పై విజయంతో ఆతిథ్య భారత్ గ్రూప్‌ దశలో వరుసగా నాలుగు మ్యాచ్‌లను గెలిచి అజేయంగా నిలిచింది.

Tags:    

Similar News