Kick Boxing : మ్యాచ్ మధ్యలోనే కుప్పకూలిపోయాడు.. నాసిరకమైన రింగ్ ఏర్పాట్లే కారణం..

Kick Boxing : కిక్ బాక్సింగ్‌ రింగ్‌లో గాయపడ్డ స్టేట్ లెవల్ బాక్సర్ నిఖిల్ మృతి చెందాడు.

Update: 2022-07-14 13:45 GMT

Kick Boxing : కిక్ బాక్సింగ్‌ రింగ్‌లో గాయపడ్డ స్టేట్ లెవల్ బాక్సర్ నిఖిల్ మృతి చెందాడు. బాక్సింగ్ రింగ్‌లో సరైన వసతులు కల్పించకపోవడం వల్ల నిఖిల్ మృతి చెందాడని తండ్రి సురేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నెల జులై 10న బెంగళూరులోని జ్ణానజ్యోతి నగర్‌లో స్టేట్ లెవల్ కిక్ బాక్సింగ్ పోటీలను నిర్వహించారు. నిఖిల్ ప్రత్యర్ది మొఖంపై ఒక పంచ్ వేయడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

ఈ మ్యాచ్‌కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ ఆర్గనైజ్ చేసిన నవీన్ రవిశంకర్ పరారీలో ఉన్నాడు. తలలో బ్లడ్ బ్లీడ్ కాకుండా క్లాట్ కావడం వల్ల నిఖిల్ నాలుగు రోజులు కోమాలోకి వెళ్లిపోయాడు.

బాక్సింగ్ రింగ్‌లోని నాసిరకం మ్యాట్, మ్యాట్ కిందకూడా ఎలాంటి సురక్షిత ఏర్పాట్లు చేయకపోవడం వల్ల తన కొడుకు నిఖిల్ మరణించాడని తండ్రి సురేశ్ అంటున్నారు. 

Tags:    

Similar News