Kidambi Srikanth: ఫైనల్స్‌కు చేరి రికార్డ్ సృష్టించాడు.. కానీ చివర్లో..

Kidambi Srikanth: ఫైనల్‌లో సింగపూర్‌కు చెందిన షట్లర్ కిన్ యూతో తలబడ్డాడు ఇండియన్ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌.;

Update: 2021-12-19 15:45 GMT

Kidambi Srikanth (tv5news.in)

Kidambi Srikanth: స్పెయిన్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించాడు ఇండియన్ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌. మరో ఇండియన్‌ ప్లేయర్‌ లక్ష్యసేన్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచులో గెలిచి..ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత పురుష షట్లర్‌గా రికార్డుల్లొకెక్కాడు. శనివారం లక్ష్యసేన్‌తో గంట 9 నిమిషాల పాటు హోరాహోరీగా జరిగిన మ్యాచులో 17-21, 21-14, 21-17 తేడాతో శ్రీకాంత్ విజయం సాధించాడు.

ఫైనల్‌లో సింగపూర్‌కు చెందిన షట్లర్ కిన్ యూతో తలబడ్డాడు శ్రీకాంత్. 15 21 20 22 తేడాతో తొలి రెండు గేమ్‌లలోనే శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. దీంతో కిన్ యూ విజయం సాధించాడు. విజయం సాధించలేకపోయినా.. శ్రీకాంత్ చివరివరకు పట్టు వదలకుండా పోరాడాడని చాలామంది భారతీయులు గర్వపడుతున్నారు.

ఇప్పటివరకు వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఇండియాకు చెందిన పురుషులు ఎవరూ ఫైనల్ వరకు చేరుకోలేదు. కానీ శ్రీకాంత్ చేరుకుని రికార్డ్ సృష్టించింది. అక్కడే శ్రీకాంత్ అందరి ప్రశంసలు పొందాడు. కాకాపోతే ఇంకా శ్రీకాంత్ ముందు ముందు ఎన్నో విజయాలు చూడాలని స్పోర్ట్స్ లవర్స్ కోరుకుంటున్నారు.


Tags:    

Similar News