IND vs NZ: టీమిండియా బ్యాటర్ల ఊచకోత

కివీస్‌ బౌలర్లపై శివాలెత్తిన బ్యాటర్లు... భారీ లక్ష్యం సునాయసంగా ఛేదన... మెరుపులు మెరిపించిన సూర్యకుమార్... ఛేదనలో దంచేసిన ఇషాన్ కిషాన్

Update: 2026-01-24 02:30 GMT

న్యూ­జి­లాం­డ్‌­తో జరు­గు­తు­న్న టీ20 సి­రీ­స్‌­లో భారత జట్టు అప్ర­తి­హత దూ­కు­డు­తో ప్ర­త్య­ర్థి­ని ఉక్కి­రి­బి­క్కి­రి చే­స్తోం­ది. భారీ లక్ష్యా­లు, ఒత్తి­డి పరి­స్థి­తు­లు ఏమా­త్రం ప్ర­భా­వం చూ­ప­కుం­డా, భారత బ్యా­టిం­గ్ వి­భా­గం వి­ధ్వం­స­కర ప్ర­ద­ర్శ­న­తో మరో­సా­రి అభి­మా­ను­ల­ను ఉర్రూ­త­లూ­గిం­చిం­ది. రెం­డో టీ20లో 209 పరు­గుల లక్ష్యా­న్ని కే­వ­లం 15.2 ఓవ­ర్ల­లో­నే ఛే­దిం­చిన భా­ర­త్‌, టీ20 క్రి­కె­ట్ చరి­త్ర­లో­నే అరు­దైన ఘన­త­ను సా­ధిం­చిం­ది. ఈ మ్యా­చ్‌­లో సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్, ఇషా­న్ కి­ష­న్, శి­వ­మ్ దూబె బ్యా­ట్ల­తో చె­ల­రే­గి­పో­గా, న్యూ­జి­లాం­డ్ బౌ­లిం­గ్, ఫీ­ల్డిం­గ్ పూ­ర్తి­గా చే­తు­లె­త్తే­సిం­ది. టాస్ ఓడి ముం­దు­గా బ్యా­టిం­గ్‌­కు ది­గిన న్యూ­జి­లాం­డ్ క్రి­కె­ట్ జట్టు ని­ర్ణీత 20 ఓవ­ర్ల­లో 6 వి­కె­ట్లు కో­ల్పో­యి 208 పరు­గుల భారీ స్కో­రు నమో­దు చే­సిం­ది. ఈ స్కో­రు చూ­స్తే మ్యా­చ్ కి­వీ­స్ వైపే మొ­గ్గు చూ­పు­తుం­ద­ని­పిం­చి­నా, భా­ర­త్ బ్యా­టిం­గ్ వి­ధ్వం­సం ముం­దు ఆ మొ­త్తం క్ష­ణా­ల్లో­నే కరి­గి­పో­యిం­ది.

న్యూ­జి­లాం­డ్ ఇన్నిం­గ్స్ ఆరం­భం నుం­చే దూ­కు­డు­గా సా­గిం­ది. భారత పే­స­ర్ అర్ష్‌­దీ­ప్ సిం­గ్‌­ను లక్ష్యం­గా చే­సు­కు­న్న ఓపె­న­ర్లు తొలి మూడు ఓవ­ర్ల­లో­నే 40కి పైగా పరు­గు­లు రా­బ­ట్టా­రు. అయి­తే నా­లు­గో ఓవ­ర్‌­లో హర్షి­త్ రాణా అద్భు­తం­గా బౌ­లిం­గ్ చే­స్తూ డె­వా­న్ కా­న్వే­ను ఔట్ చే­య­డం­తో భా­ర­త్‌­కు తొలి బ్రే­క్ లభిం­చిం­ది. ఆ ఓవర్ మె­యి­డె­న్‌­గా మా­ర­డం వి­శే­షం. ఆ తర్వాత వరు­ణ్ చక్ర­వ­ర్తి మరో ఓపె­న­ర్ టిమ్ సీ­ఫ­ర్ట్‌­ను పె­వి­లి­య­న్‌­కు పం­ప­డం­తో కి­వీ­స్‌­కు షాక్ తగి­లిం­ది. అయి­న­ప్ప­టి­కీ రచి­న్ రవీం­ద్ర తన దూ­కు­డు­ను తగ్గిం­చ­లే­దు. స్పి­న్న­ర్లు, పే­స­ర్లు అన్న తేడా లే­కుం­డా బం­తు­ల­ను సి­క్స్‌­ల­కు తర­లి­స్తూ భారత బౌ­ల­ర్ల­పై ఒత్తి­డి పెం­చా­డు. గ్లె­న్ ఫి­లి­ప్స్, డె­రి­ల్ మి­చె­ల్ కూడా కీలక సమ­యా­ల్లో పరు­గు­లు జో­డిం­చా­రు. భారత బౌ­ల­ర్లు కట్టు­ది­ట్టం­గా బౌ­లిం­గ్ చే­య­డం­తో పరు­గుల వేగం కొంత తగ్గిం­ది.

209 పరు­గుల లక్ష్యం­తో బ్యా­టిం­గ్ ప్రా­రం­భిం­చిన భారత క్రి­కె­ట్ జట్టు­కు ఆరం­భం­లో­నే ఎదు­రు­దె­బ్బ తగి­లిం­ది. సంజు శాం­స­న్, అభి­షే­క్ శర్మ తక్కువ స్కో­ర్ల­కే ఔట­య్యా­రు. కానీ ఆ దశలో క్రీ­జు­లో ని­లి­చిన ఇషా­న్ కి­ష­న్ ఏమా­త్రం ఒత్తి­డి­కి లో­ను­కా­లే­దు. మూడో ఓవర్ నుం­చే బౌ­ల­ర్ల­పై వి­రు­చు­కు­ప­డ్డా­డు. జాక్ ఫౌ­క్స్ వే­సిన ఓవ­ర్‌­లో వరుస బౌం­డ­రీ­లు, సి­క్స్‌­తో మ్యా­చ్ ది­శ­ను మా­ర్చే­శా­డు. స్పి­న్న­ర్ శాం­ట్న­ర్‌­పై కూడా ఇషా­న్ వె­ను­కా­డ­లే­దు. కే­వ­లం 21 బం­తు­ల్లో­నే అర్ధ­సెం­చ­రీ పూ­ర్తి చేసి, భా­ర­త్ ఛే­ద­న­కు బల­మైన పు­నా­ది వే­శా­డు. ఇషా­న్‌­కు అం­డ­గా మరో­వై­పు సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్ తన సహజ శై­లి­లో బ్యా­టిం­గ్ చే­శా­డు. ఫీ­ల్డ్ అం­త­టా షా­ట్లు ఆడు­తూ, బౌ­ల­ర్ల లైన్ లెం­గ్త్‌­ను పూ­ర్తి­గా చె­డ­గొ­ట్టా­డు. ఒకే ఓవ­ర్‌­లో 25 పరు­గు­లు రా­బ­ట్టి కి­వీ­స్ క్యాం­ప్‌­లో ఆం­దో­ళన పెం­చా­డు. ఇషా­న్ ఔటై­నా, అప్ప­టి­కే మ్యా­చ్ భా­ర­త్ వైపు పూ­ర్తి­గా మళ్లి­పో­యిం­ది.

ఇషా­న్ ఔట్ తర్వాత సూ­ర్య­తో కలి­సి శి­వ­మ్ దూబె కూడా దూ­కు­డు­గా ఆడా­డు. అవ­స­ర­మైన రన్‌­రే­ట్ ఎప్ప­టి­కీ అదు­పు­లో­నే ఉం­డ­గా, సూ­ర్య-దూబె జోడీ సి­క్స్‌­ల­తో ప్రే­క్ష­కు­ల­ను ఉర్రూ­త­లూ­గిం­చిం­ది. చి­వ­రి­కి భా­ర­త్ 28 బం­తు­లు మి­గి­లుం­డ­గా­నే లక్ష్యా­న్ని ఛే­దిం­చిం­ది. సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్ అజే­యం­గా ని­లి­చి మ్యా­చ్‌­ను ము­గిం­చ­డం వి­శే­షం. ఈ మ్యా­చ్‌­లో భా­ర­త్ నమో­దు చే­సిన ఛేదన టీ20 క్రి­కె­ట్ చరి­త్ర­లో­నే వే­గ­వం­త­మైన 200 పై­చి­లు­కు లక్ష్య ఛే­ద­న­గా రి­కా­ర్డు­ల­కె­క్కిం­ది. గతం­లో పా­కి­స్థా­న్ చే­సిన రి­కా­ర్డు­ను భా­ర­త్ బద్ద­లు కొ­ట్టిం­ది.

Tags:    

Similar News