కోల్‌కతా నైట్ రైడర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌కు ముందు తమ కోచింగ్ బృందంలో కీలక మార్పు చేసింది. ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌ను జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా నియమించినట్లు అధికారికంగా ప్రకటించింది. 44 ఏళ్ల షేన్ వాట్సన్ అంతర్జాతీయ క్రికెట్లో విశేష అనుభవం కలిగిన ఆటగాడు. ఆయన ఆస్ట్రేలియా తరఫున 59 టెస్టులు, 190 వన్డేలు, 58 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించి, 10,000 కంటే ఎక్కువ పరుగులు, 280 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టారు. 2007, 2015 ప్రపంచ కప్‌ల విజేత ఆస్ట్రేలియా జట్లలో ఆయన కీలక సభ్యుడు. కేకేఆర్ ప్రధాన కోచ్‌గా నియమితులైన భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో కలిసి వాట్సన్ పని చేయనున్నారు. తన నియామకంపై స్పందించిన వాట్సన్, "కోల్‌కతాకు మరో టైటిల్ తీసుకురావడానికి కోచింగ్ బృందం, ఆటగాళ్లతో కలిసి పని చేయడానికి నేను ఆసక్తిగా ఉన్నాను" అని సంతోషం వ్యక్తం చేశారు. ఐపీఎల్లో కూడా వాట్సన్‌కు సుదీర్ఘ అనుబంధం ఉంది.
ఆయన 2008 నుంచి 2020 వరకు 145 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 4 సెంచరీలు నమోదు చేశారు. వాట్సన్ గతంలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్ జట్లలో ఆడారు. 2008లో రాజస్థాన్ రాయల్స్‌కు తొలి ఐపీఎల్ టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించి, ఆ సీజన్లో, అలాగే 2013లో మోస్ట్ వాల్యూవబల్ ప్లేయర్ (MVP) అవార్డును గెలుచుకున్నారు. కేకేఆర్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో కోచ్‌గా అనుబంధం ఉన్న వాట్సన్ అనుభవాన్ని తమ టైటిల్ లక్ష్యానికి ఉపయోగించుకోవాలని చూస్తోంది.