IPL: పంజాబ్‌-కోల్‌కతా మ్యాచ్‌ వర్షార్పణం

చెరో జట్లకు చెరో పాయింట్;

Update: 2025-04-27 02:00 GMT

ఐపీఎల్ 2025లో భాగంగా కోల్ కతా, పంజాబ్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. పంజాబ్ ఇన్నింగ్స్ పూరైన తర్వాత వర్షం పడటంతో కోల్ కతా బ్యాటింగ్ కు బ్రేక్ పడింది. వర్షం తగ్గుతుందని ఎదురు చూసిన అభిమానుల ఆశలు నిరాశగానే మిగిలాయి. ఎంత సేపటికీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్ల ఖాతాల్లో ఒక్కొక్క పాయింట్ చేరింది.

KKR టార్గెట్ ఎంతంటే?

IPL 2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌‌లో KKRపై PBKS సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న PBKSకి గుడ్ స్టార్ట్ లభించింది. ప్రియాంశ్‌ ఆర్య (69), ప్రభుసిమ్రన్‌ సింగ్‌ (83) కోల్‌కతా బౌలర్లను ఆడుకున్నారు. శ్రేయస్‌ అయ్యర్‌ (25*) రాణించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. KKRకు 202 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

Tags:    

Similar News