IPL: క్లాసెన్ ఊచకోత... హైదరాబాద్ ఘన విజయం
అద్భుత శతకంతో చెలరేగిన హెన్రిచ్ క్లాసెన్... 110 పరుగుల తేడాతో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌పై ఘన విజయం;
ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. తొలుత బంతితో చెలరేగిన హైదరాబాద్.. తర్వాత బంతితోనూ రాణించింది. దీంతో 62 పరుగుల తేడాతో కోల్‌కత్తాపై హైదరాబాద్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కత్తా 167 పరుగులకే పరిమితమైంది.**
క్లాసెన్ ఊచకోత
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (105*; 39 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్‌లు) ‘శత’క్కొట్టగా.. ట్రావిస్ హెడ్ (76; 40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) చెలరేగాడు. అభిషేక్ శర్మ (32; 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంతసేపూ మెరుపులు మెరిపించాడు. ఇషాన్ కిషన్ (29; 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ 2, వైభవ్ అరోరా ఒక వికెట్ పడగొట్టారు. క్లాసెన్, ఇషాన్ జోరు కొనసాగించడంతో 18 ఓవర్లకు స్కోరు 250 దాటింది. దీంతో సన్‌రైజర్స్ తన పేరిట ఉన్న 287/3 స్కోరు రికార్డును తిరగరాస్తుందేమో అనిపించింది. అయితే, తర్వాతి ఓవర్లో వైభవ్ ఇషాన్‌ను ఔట్ చేసి ఏడు పరుగులే ఇచ్చాడు. చివరి ఓవర్‌లో 17 పరుగులే రావడంతో కొత్త రికార్డు నమోదు కాలేదు. 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కత్తా 147 పరుగులకే పరిమితమైంది. కోల్‌కత్తా బ్యాటర్లలో నరైన్ 31, మనీశ్ పాండే 37, హర్షిత్ రాణా 30 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. జయదేవ్ ఉనద్కత్, హర్ష్ దూబే 3 వికెట్లతో రాణించారు.
హ్యాట్రిక్ విజయంతోముగింపు
IPL-2025 సీజన్‌ను హైదరాబాద్ భారీ విజయంతో ముగించింది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తర్వాత జోరందుకున్న హైదరాబాద్ ఆదివారం KKRతో జరిగిన మ్యాచ్‌లో అంతకుమించిన దూకుడు ప్రదర్శించి వరుసగా మూడో విజయంతో ఈ సీజన్‌కు టాటా చెప్పింది. ఈ మ్యాచ్‌లో కోల్ కత్తాపై 110 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. మొత్తం ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ ఆరింట గెలిచి పాయింట్ల పట్టికలో ఆరవ స్థానంలో నిలిచింది.