KOHLI: క్రెడిట్ తీసుకోవాలని చూసి కోహ్లీపై నిందలా: బీజేపీ

బెంగళూరు తొక్కిసలాట కేసులో ప్రభుత్వ నివేదికలో సంచలన విషయాలు;

Update: 2025-07-18 07:30 GMT

ఐపీ­ఎ­ల్ వి­జ­యో­త్స­వాల వేళ చి­న్న­స్వా­మి స్టే­డి­యం వద్ద చో­టు­చే­సు­కు­న్న తొ­క్కి­స­లాట ఘట­న­పై కర్ణా­టక ప్ర­భు­త్వం వి­డు­దల చే­సిన ని­వే­దిక కీలక వి­ష­యా­ల­ను వె­ల్ల­డిం­చిం­ది. దా­ని­లో స్టా­ర్ క్రి­కె­ట­ర్ వి­రా­ట్ కో­హ్లీ పే­రు­ను ప్ర­స్తా­విం­చిన సం­గ­తి తె­లి­సిం­దే. ఈ నే­ప­థ్యం­లో సి­ద్ధ­రా­మ­య్య ప్ర­భు­త్వం­పై బీ­జీ­పే వి­మ­ర్శ­లు గు­ప్పిం­చిం­ది. ఆర్సీ­బీ వి­జ­యా­ని­కి ప్ర­భు­త్వం క్రె­డి­ట్ తీ­సు­కో­వా­ల­ని చూ­సిం­ద­ని, ఇప్పు­డు ఫ్రాం­చై­జీ­ని, కో­హ్లీ­ని నిం­ది­స్తోం­ద­ని దు­య్య­బ­ట్టిం­ది. హై­కో­ర్టు ఆదే­శాల ప్ర­కా­రం రా­ష్ట్ర ప్ర­భు­త్వం ఈ ని­వే­ది­క­ను బయ­ట­పె­ట్టిం­ది. పో­లీ­సుల నుం­చి అను­మ­తు­లు తీ­సు­కో­కుం­డా­నే వి­ధాన సౌధ నుం­చి చి­న్న­స్వా­మి స్టే­డి­యం వరకు జరి­గే వి­జ­యో­త్సవ ర్యా­లీ­లో పా­ల్గొ­నా­ల్సిం­ది­గా ప్ర­జ­ల­ను ఆహ్వా­ని­స్తూ ఆర్సీ­బీ సో­ష­ల్ మీ­డి­యా­లో పో­స్టు­లు పె­ట్టిం­ది. అభి­మా­ను­ల­తో కలి­సి ఈ వి­జ­యా­న్ని సె­ల­బ్రే­ట్ చే­సు­కో­వా­ల­ను­కుం­టు­న్న­ట్లు వి­రా­ట్‌ మా­ట్లా­డిన వీ­డి­యో క్లి­ప్‌­ను షేర్ చే­సిం­ద­ని ఆ రి­పో­ర్ట్ పే­ర్కొం­ది. ఇవ­న్నీ చి­న్న­స్వా­మి స్టే­డి­యా­ని­కి భా­రీ­గా ప్ర­జ­లు తరలి రా­వ­డా­ని­కి దో­హ­దం చే­శా­య­ని వె­ల్ల­డిం­చిం­ది. ‘‘ఆర్సీ­బీ ఒక్క­టే ప్ర­జ­ల­ను ఆహ్వా­నిం­చ­లే­దు. కాం­గ్రె­స్‌ కూడా వా­రి­ని ఆహ్వా­నిం­చిం­ది. ని­వే­దిక ప్ర­కా­రం ఆర్సీ­బీ­ది మా­త్ర­మే తప్పు అయి­తే.. ప్ర­భు­త్వం పో­లీ­సు అధి­కా­రు­ల­ను ఎం­దు­కు సస్పెం­డ్ చే­సి­న­ట్టు..? ఈవెం­ట్ ని­ర్వ­హి­స్తా­మ­ని ఆర్సీ­బీ నుం­చి సమా­చా­రం ఉంటే.. ప్ర­భు­త్వం అను­మ­తి ని­రా­క­రిం­చి­ఉం­డా­లి. ఆ వి­జ­యా­ని­కి క్రె­డి­ట్ తీ­సు­కో­వ­డం కో­స­మే.. ము­ఖ్య­మం­త్రి, ఉప ము­ఖ్య­మం­త్రి ప్ర­జ­ల­ను ఆహ్వా­నిం­చా­రు. ఇప్పు­డు గొ­ప్ప ఆట­గా­డు కో­హ్లీ, ఆర్సీ­బీ మీద నిం­ద­లు వే­య­డం తప్పు’’ అని బీజేపీ నేత అర­విం­ద్‌ బె­ల్లా­డ్ వి­మర్శించారు.

Tags:    

Similar News