KOHLI: విరాట్ కోహ్లీకి ఫ్యాన్స్ స్టాండింగ్ ఒవేషన్

తీవ్ర భావోద్వేగానికి గురైన విరాట్

Update: 2025-10-24 04:00 GMT

టీ­మిం­డి­యా స్టా­ర్ బ్యా­ట­ర్ వి­రా­ట్ కో­హ్లీ తీ­వ్ర భా­వో­ద్వే­గా­ని­కి గు­ర­య్యా­డు. ఆస్ట్రే­లి­యా­తో అడి­లై­డ్ వే­ది­క­గా జరు­గు­తు­న్న రెం­డో వన్డే­లో­నూ డకౌ­టైన కో­హ్లీ­కి ప్రే­క్ష­కుల నుం­చి ఊహిం­చ­ని రె­స్పా­న్స్ లభిం­చిం­ది. కో­హ్లీ డకౌ­ట్ అయి­నా.. ప్రే­క్ష­కు­లం­తా కిం­గ్‌­కు స్టాం­డిం­గ్ ఓవే­ష­న్ ఇచ్చా­రు. 17 ఏళ్ల సు­దీ­ర్ఘ కె­రీ­ర్‌­లో ఎన్నో చి­ర­స్మ­ర­ణీయ ఇన్నిం­గ్స్‌­లు ఆడిన కో­హ్లీ.. అడి­లై­డ్ ఫ్యా­న్స్ ఘన వీ­డ్కో­లు పలి­కా­రు. ము­ఖ్యం­గా అడి­లై­డ్ మై­దా­నం­తో కో­హ్లీ­కి ప్ర­త్యే­క­మైన అను­బం­ధం ఉంది. ఈ ఒక్క మై­దా­నం­లో­నే కో­హ్లీ 5 శత­కా­లు బా­దా­డు. అం­తే­కా­కుం­డా అం­త­ర్జా­తీయ క్రి­కె­ట్‌­లో ఈ మై­దా­నం­లో అత్య­ధిక పరు­గు­లు చే­సిన బ్యా­ట­ర్‌­గా­నూ రి­కా­ర్డ్ సా­ధిం­చా­డు.

కెరీర్ లోనే తొలిసారి

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు. తొలి వన్డేల్లో 8 బంతులు ఆడి ఖాతా తెరవలేకపోయిన కోహ్లి.. గురువారం తనకు అచ్చొచ్చే మైదానమైన అడిలైడ్‌లో 4 బంతుల డకౌట్‌ను నమోదు చేశాడు. కోహ్లి తన 17 ఏళ్ల కెరీర్‌లో వరుసగా రెండు వన్డేల్లో డకౌట్‌ కావడం ఇదే మొదటిసారి.

రోహిత్ శర్మ సరికొత్త రికార్డు

ఆస్ట్రే­లి­యా­తో జరు­గు­తు­న్న రెం­డో వన్డే­లో టీ­మిం­డి­యా ఓపె­న­ర్ రో­హి­త్ శర్మ సరి­కొ­త్త రి­కా­ర్డు నె­ల­కొ­ల్పా­డు. వన్డే­ల్లో ఓపె­న­ర్‌­గా అత్య­ధిక పరు­గు­లు చే­సిన ఆట­గా­ళ్ల జా­బి­తా­లో 5వ స్థా­నా­ని­కి చే­రు­కు­న్నా­డు. 9180+ పరు­గు­లు చేసి.. మాజీ క్రి­కె­ట­ర్ సౌ­ర­వ్ గం­గూ­లీ (9146)ని అధి­గ­మిం­చా­డు. రో­హి­త్ కంటే ముం­దు.. సచి­న్(15310), సనత్ జయ­సూ­ర్య (12740), క్రి­స్ గేల్ (10179), ఆడమ్ గి­ల్‌­క్రి­స్ట్ (9200) వరుస నా­లు­గు స్థా­నా­ల్లో ఉన్నా­రు.

Tags:    

Similar News