KULDEEP YADAV: ఘనంగా కుల్దీప్‌యాదవ్‌ ఎంగేజ్‌మెంట్‌

పెళ్లి పీటలు ఎక్కబోతున్న టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్;

Update: 2025-06-05 03:00 GMT

 టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన వంశికను కుల్దీప్‌ వివాహం చేసుకోబోతున్నాడు. తాజాగా వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. లఖ్‌నవూలో కొద్ది మంది బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ‌లో శ్యామ్‌నగర్‌లో నివాసం ఉంటున్న వంశిక ఎల్‌ఐసీలో పని చేస్తున్నారు. వంశిక చిన్ననాటి నుంచి కుల్దీప్‌నకు స్నేహితురాలు. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే వీరి వివాహం ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇంగ్లండ్‌లో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు కుల్దీప్ ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో ఆ సిరీస్‌కు వెళ్లే ముందే నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ ఏడాదిలోనే వివాహం ఉండబోతున్నట్టు సమాచారం. కాగా, కుల్దీప్ నిశ్చితార్థానికి క్రికెటర్ రింకూ సింగ్ హాజరైనట్టు తెలుస్తోంది. కాగా, రింకూ సింగ్‌కు కూడా ఇటీవలె వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే.

ఇక ఎంగేజ్‌మెంట్ వేడుకలో కుల్‌దీప్ యాదవ్ క్రీమ్ క‌ల‌ర్ ప్యాంట్, సూట్ ధ‌రించాడు. అటు వ‌న్షిక ఎరుపు రంగు ఎంబ్రాయిడ‌రీ లెహెంగాలో మెరిసింది. ఇఠీవల ముగిసిన ఐపీఎల్ 2025లో కుల్‌దీప్ యాదవ్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. ఈ సీజన్‌లో 7.08 ఎకాన‌మీతో 15 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న కుల్‌దీప్ యాదవ్.. త్వ‌ర‌లోనే లండన్ వెళ్లనున్నాడు. ఈ పర్యటన తర్వాతే వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News