MEGHANA: 8 నెలల గర్భం.. అయినా గురితప్పని లక్ష్యం

షూటర్ మేఘనా సజ్జనార్ కొత్త చరిత్ర... ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం.. స్త్రీ ధైర్యానికి ప్రతీక అంటూ పొగడ్తలు

Update: 2026-02-10 06:00 GMT

తల్లి గర్భంలో ఓ కొత్త జీవితం… చేతుల్లో ఓ భారీ ఎయిర్ రైఫిల్… మనసులో అపారమైన ధైర్యం. ఈ మూడు కలిసినప్పుడు చరిత్రే కొత్తగా రాసుకుంది.

బెం­గ­ళూ­రు­కు చెం­దిన 32 ఏళ్ల భారత షూ­ట­ర్ మే­ఘ­నా సజ్జ­నా­ర్ ఆసి­యా షూ­టిం­గ్ ఛాం­పి­య­న్‌­షి­ప్‌­లో గుం­డె­ల్ని కది­లిం­చే వి­జ­యా­న్ని సా­ధిం­చిం­ది. ఎని­మి­దో నెల గర్భ­వ­తి­గా ఉండి, ప్ర­పంచ స్థా­యి షూ­ట­ర్ల­తో పో­టీ­ప­డి, 10 మీ­ట­ర్ల ఎయి­ర్ రై­ఫి­ల్ వి­భా­గం­లో కాం­స్య పతకం సా­ధిం­చ­డం మా­త్ర­మే కాదు.. భారత జట్టు­కు టీమ్ గో­ల్డ్ మె­డ­ల్ కూడా అం­దిం­చిం­ది. ఈ వి­జ­యం కే­వ­లం ఒక మె­డ­ల్ కాదు… ఇది స్త్రీ ధై­ర్యా­ని­కి, తల్లి శక్తి­కి, మనసు బలా­ని­కి ప్ర­తీక.

ఇది ఓ ప్రత్యేక అనుభవం: మేఘనా

పోటీ ము­గి­సిన తర్వాత మీ­డి­యా­తో మా­ట్లా­డిన మే­ఘ­నా,“ఇది ని­జం­గా ప్ర­త్యే­క­మైన అను­భ­వం. నేను షూ­టిం­గ్ చే­స్తుం­టే, లోపల నా బి­డ్డ కద­ల­డం… అది మా­ట­ల్లో చె­ప్ప­లే­ని అను­భూ­తి” అని భా­వో­ద్వే­గం­గా చె­ప్పిం­ది. పోటీ సమ­యం­లో ని­ల­బ­డి షూ­టిం­గ్ చే­య­డం గర్భ­ధా­ర­ణ­లో చాలా కష్టం. అయి­నా ప్ర­పంచ స్థా­యి ఫీ­ల్డ్‌­ను ఎదు­ర్కొ­ని మూడో స్థా­నం­లో ని­ల­వ­డం ఆమె మా­న­సిక దృ­ఢ­త్వా­ని­కి ని­ద­ర్శ­నం. “మేఘనా, నిన్ను ఇలా చూడటం నాకు అపారమైన గౌరవాన్ని కలిగించింది. బలం అనేది అనేక రూపాల్లో ఉంటుందని, ధైర్యం ఎప్పుడూ మార్గం కనుగొంటుందని నువ్వు నిరూపించావు.” ఈ మాటలు మేఘనా సాధనకు వచ్చిన గౌరవమే కాకుండా, లక్షలాది మహిళలకు ఇచ్చిన ప్రేరణ.

 వెనుక ఉన్న బలమైన సహకారం

“ఇది ఒం­ట­రి­గా సా­ధిం­చిన వి­జ­యం కాదు” అని మే­ఘ­నా స్ప­ష్టం చే­సిం­ది.కో­చ్‌­లు, సహ­చ­రు­లు, కు­టుంబ సభ్యు­లు – అం­ద­రూ కలి­సి తనకు అం­డ­గా ని­లి­చా­ర­ని చె­ప్పిం­ది. “ని­ల­బ­డి షూ­టిం­గ్ చే­య­డం చాలా కష్టం. కానీ నా టీమ్ అంతా నన్ను ఎంతో సపో­ర్ట్ చే­సిం­ది. శి­క్ష­ణ­లో, పో­టీ­ల్లో నా సా­మ­గ్రి­ని మో­సు­కో­వ­డం­లో సహా­యం చే­శా­రు. అం­ద­రూ కలి­సి ఈ వి­జ­యం సా­ధిం­చా­రు” అని అల­స­ట­తో అయి­నా చి­రు­న­వ్వు­తో చె­ప్పిం­ది.

గర్భంతో సాధన – కొత్త సవాళ్లు

గర్భ­ధా­రణ మే­ఘ­న­కు కొ­త్త సవా­ళ్ల­ను తీ­సు­కొ­చ్చిం­ది. శరీర ఆకృ­తి మా­ర­డం­తో షూ­టిం­గ్ జా­కె­ట్, ట్రౌ­జ­ర్లు తరచూ మా­ర్చు­కో­వా­ల్సి వచ్చిం­ది. “మనం సా­ధా­ర­ణం­గా ఒకే జా­కె­ట్‌­కు అల­వా­టు పడ­తాం. కానీ నాకు రోజూ మా­ర్పు­లు చే­యా­ల్సి వచ్చిం­ది. నె­మ్మ­ది­గా, ఓపి­క­తో ఒక్కో రోజు ఒక్కో అడు­గు వే­సు­కుం­టూ ముం­దు­కు వె­ళ్లా­ను” అని చె­ప్పిం­ది. మేఘనా సజ్జనార్ కథ ఒక మెడల్ కథ కాదు. ఇది స్త్రీలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించగలరని నిరూపించిన జీవంత ఉదాహరణ.

 గర్భంతోనే లక్ష్యాన్ని ఛేదించిన ఈ తల్లి… లక్షలాది అమ్మాయిలకు ఒక సందేశం ఇచ్చింది...  “నీ కలల్ని వాయిదా వేయొద్దు… నీ ధైర్యమే నీ ఆయుధం.”

Tags:    

Similar News