MSK: ఎమ్మెస్కే ప్రసాద్‌కు ఘోర అవమానం!
బీసీసీఐకి ఫిర్యాదు చేసే యోచన
టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్, తెలుగు తేజం ఎమ్మెస్కే ప్రసాద్‌కు ఘోర అవమానం ఎదురైంది. ప్రపంచకప్ విన్నర్, తెలుగు తేజం శ్రీచరణికి ఘన స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఎమ్మెస్కే ప్రసాద్‌ను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంది. ఈ వ్యవహారంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెస్కే ప్రసాద్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మాజీ క్రికెటర్, చీఫ్ సెలెక్టర్‌గా తనకు ప్రోటోకాల్ ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెస్కే ప్రసాద్.. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ప్రతినిధులపై కూడా బీసీసీఐకి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా ఎమ్మెస్కే ప్రసాద్ అద్భుత పనితీరు కనబర్చాడు. 2009 నుంచి 2014 వరకు ఈ బాధ్యతలు నిర్వర్తించిన ఎమ్మెస్కే ప్రసాద్.. క్రికెటర్లకు మౌళిక వసతులు కల్పించాడు. ఏసీ క్రికెట్ అకాడమీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏసీఏ మైదానాల అభివృద్ధికి కృషి చేశారు. ఈ పని తీరుకు రివార్డ్గానే చీఫ్ సెలెక్టర్ పదవి దక్కింది. అలాంటి ఆటగాడిని సెక్యూరిటీ అడ్డుకోవడంపై క్రికెట్ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ తరఫున ఆరు టెస్టు మ్యాచ్‌లు.. 17 వన్డేలు ఆడాడు.
శ్రీ చరణిపై వరాల జల్లు
టీమిండియా లెఫ్టార్మ్ స్పిన్నర్, కడప అమ్మాయి నల్లపురెడ్డి శ్రీ చరణిపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. వన్డే ప్రపంచకప్‌లో సత్తా చాటిన తెలుగుతేజం, రాష్ట్రానికి చెందిన మహిళా క్రికెటర్ శ్రీచరణిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదు పురస్కారంను ప్రకటించింది. అంతేకాదు పాటు గ్రూప్-1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలంను ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ విషయాన్ని మీడియా సమావేశంలో శ్రీ చరణి స్వయంగా చెప్పారు. మహిళా మంత్రులు వంగలపూడి అనిత, సవిత, గుమ్మిడి సంధ్యారాణి ఆమెకు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ఏసీఏ, శాప్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. క్రికెట్ అభిమానులు, యువ క్రీడాకారులు జాతీయ పతాకాలు ప్రదర్శిస్తూ ఆమెకు మద్దతుగా పాల్గొన్నారు. అనంతరం ఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్న శ్రీచరణి, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్లను మంత్రి నారా లోకేశ్ ఆహ్వానించారు. క్యాంపు కార్యాలయంలోకి తీసుకెళ్లి... సీఎం చంద్రబాబుకు పరిచయం చేశారు. ఆమెను సీఎం ఆత్మీయంగా పలకరించారు. శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం, జ్ఞాపిక అందజేశారు.
ఈ సందర్భంగా ఏపీ సర్కార్‌తో పాటు తెలుగు క్రికెట్ అభిమానులకు శ్రీ చరణి కృతజ్ఞతలు తెలిపింది. చంద్రబాబు నాయుడితో జరిగిన సమావేశ వివరాలను మీడియాతో పంచుకుంది. ప్రపంచకప్ ప్రదర్శనపై టీమిండియా మాజీ స్పిన్నర్ అశ్విన్ ప్రశంసలు సంతోషాన్నిచ్చాయని తెలిపింది. నన్ను నమ్మి ప్రోత్సహించడం సంతోషంగా ఉంది. ఏసీఏ సహకారం వల్ల నా క్రికెట్ జర్నీలో పెద్దగా కష్టాలు పడలేదు. ప్రొఫెషనల్ జర్నీలో ఐదేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం నాకు దక్కింది. నారా లోకేష్ అండగా ఉన్నారు. మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు." అని శ్రీచరణి చెప్పుకొచ్చింది.