Neeraj Chopra : నీరజ్ చోప్రాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..!
టోక్యో ఒలింపిక్స్‌లో అదరగొట్టి స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో నీరజ్ చోప్రాను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.;
టోక్యో ఒలింపిక్స్‌లో అదరగొట్టి స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో నీరజ్ చోప్రాను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని అతని స్నేహితుడు ఒకరు వెల్లడించారు. గత కొన్నిరోజులుగా నీరజ్ జ్వరంతో బాధపడుతున్నాడు. ఇటీవల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి కూడా హాజరు కాలేకపోయాడు. అయితే తాజాగా ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో మాత్రం పాల్గొన్నాడు. అనంతరం ఢిల్లీ నుంచి పానిపట్ వరకు భారీ కాన్వాయ్‌తో తన స్వగ్రామానికి బయలుదేరాడు. స్వగ్రామానికి వెళ్ళిన నీరజ్‌కు అపూర్వ స్వాగతం లభించింది. గ్రామస్థులతో పాటుగా వివిధ ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం పలికారు. ఈ యాత్రలో నీరజ్ నీరసించిపోవడంతో కాస్త అస్వస్థతకు గురయ్యాడు.