ఒలింపిక్స్‌లో అదరగొట్టిన నీరజ్ చోప్రా.. వందేళ్లలో భారత్‌కు తొలి స్వర్ణం..!
ఒలింపిక్స్‌లో భారత స్వర్ణ పతక ఆశలను యువకెరటం నీరజ్ చోప్రా నిలబెట్టాడు. జావెలిన్ త్రో విభాగంలో అత్యధిక దూరం విసిరి గోల్డ్ మెడల్ సాధించాడు.;
ఒలింపిక్స్‌లో భారత స్వర్ణ పతక ఆశలను యువకెరటం నీరజ్ చోప్రా నిలబెట్టాడు. జావెలిన్ త్రో విభాగంలో అత్యధిక దూరం విసిరి గోల్డ్ మెడల్ సాధించాడు. క్వాలిఫయింగ్ రౌండ్లలోనే ఫేవరేట్లను వెనక్కి నెట్టి 86 మీటర్ల దూరం జావెలిన్ విసిరి ఔరా అనిపించిన నీరజ్.. ఫైనల్ పోరులో మరింత ప్రతిభ కనబర్చాడు. తొలి అటెంప్ట్‌లో 87.03 మీటర్ల దూరం విసిరిన నీరజ్... రెండో ప్రయత్నంలో 87.58 మీటర్ల దూరం విసిరాడు. అయితే మూడో ప్రయత్నంలో కాస్త నెమ్మదించినా.. ఓవరాల్‌గా ఎక్కువ దూరం విసిరిన వ్యక్తిగా నిలిచి గోల్డ్ పట్టేశాడు. అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు స్వర్ణపతకం రావడం వందేళ్లలో ఇదే మొదటిసారి.