నీరజ్ చోప్రా.. ప్రస్తుతం అంతర్జాతీయ క్రీడాల్లో భారత్ పేరును మార్మోగిస్తున్న హీరో. కేవలం క్రికెట్ కంట్రీగానే పేరుబడిన ఇండియాలో విప్లవాత్మక మార్పులకు కారణమవుతున్నాడు. టోక్యో ఒలింపిక్స్-2020లో పసిడి పతకం గెలిచిన నీరజ్ చోప్రా.. 2024 పారిస్ ఒలింపిక్స్లో రజతం సొంతం చేసుకున్నాడు. అలాగే, 27 ఏళ్ల ఈ హర్యానా అథ్లెట్ ఖాతాలో ప్రపంచ చాంపియన్షిప్ స్వర్ణాలు, డైమండ్ లీగ్ టైటిల్స్.. అదే విధంగా ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకాలతో సత్తా చాటాడు. ఇటీవల పారిస్ డైమండ్ లీగ్, ఓస్ట్రావా గోల్డెన్ స్పైక్ టోర్నీల్లో టైటిల్స్ కైవసం చేసుకున్న నీరజ్ చోప్రా.. తాజాగా క్లాసిక్ గెలిచి హ్యాట్రిక్ కొట్టాడు.
గోల్డెన్ బాయ్
తాజాగా బెంగళూరు వేదికగా తన పేరిట జరిగిన ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ టైటిల్ను ఈ గోల్డెన్ బాయ్ సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో తన పేరిట జరుగుతున్న అంతర్జాతీయ పోటీలో తానే పసిడి పతకం గెలిచిన తొలి అథ్లెట్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. అత్యుత్తమంగా ఈటెను 86.18 మీటర్ల దూరం విసిరి నీరజ్ గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. కాగా టోక్యో ఒలింపిక్స్-2020లో పసిడి పతకం గెలిచిన నీరజ్ చోప్రా.. 2024 పారిస్ ఒలింపిక్స్లో రజతం సొంతం చేసుకున్నాడు. అంతేకాదు..27 ఏళ్ల ఈ హర్యానా అథ్లెట్ ఖాతాలో ప్రపంచ చాంపియన్షిప్ స్వర్ణాలు, డైమండ్ లీగ్ టైటిల్స్.. అదే విధంగా ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో గెలిచిన పతకాలు ఉన్నాయి. ఇటీవల పారిస్ డైమండ్ లీగ్, ఓస్ట్రావా గోల్డెన్ స్పైక్ టోర్నీల్లో టైటిల్స్ కైవసం చేసుకున్న నీరజ్ చోప్రా హ్యాట్రిక్ కొట్టాడు.