GILL: నాపై ఎవరికీ అంచనాల్లేవ్: గిల్
టెస్ట్ కొత్త కెప్టెన్ గిల్ సంచలన వ్యాఖ్యలు;
టీమిండియా నయా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక కామెంట్స్ చేశాడు. ‘నా సారథ్యం గురించి గంభీర్, అగార్కర్‌లతో పలుమార్లు చర్చించా. లీడర్‌గా నేనేం చేయగలనో అది చేయాల్సిందిగా వాళ్లు సూచించారు. నా కెప్టెన్సీపై ఎక్స్‌పెక్టేషన్స్ లేవని వాళ్లు అన్నారు. నేనేం చేయలేనో అది చేయాలని వాళ్లు భావించడం లేదు. కానీ, కెప్టెన్‌గా నాకంటూ నాపై కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి’ అని వ్యాఖ్యానించాడు.
లక్ష్మణ్‌కు టీమిండియాలో కీలక బాధ్యత!
ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు సన్నాహాలను భారత్ క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షించనున్నారు. గౌతమ్ గంభీర్ గైర్హాజరీలో వీవీఎస్ లక్ష్మణ్ ఈ బాధ్యతను నిర్వర్తించనున్నారు. టెస్ట్ సిరీస్‌కు ముందు గంభీర్ ఇంగ్లాండ్‌ను వీడారు. గంభీర్ తిరిగి వచ్చేవరకు లక్ష్మణ్ టీమిండియా సన్నాహాలను పర్యవేక్షిస్తారు. గతంలో దక్షిణాఫ్రికాతో జరిగిన T20 సిరీస్‌లో జట్టుకు లక్ష్మణ్ మార్గదర్శకత్వం వహించారు. గతంలో కూడా లక్ష్మణ్ దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత క్రికెట్ జట్టుకు మార్గదర్శకత్వం వహించారు. అయితే గౌతమ్ గంభీర్ ఎప్పుడు ఇంగ్లాండ్‌కు తిరిగి వస్తారనేది ఇంకా తెలియదు. కాబట్టి గంభీర్ వచ్చేవరకు అంతా లక్ష్మణ్ పర్యవేక్షణలోనే ఉంటుంది.
టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ కాదు.. ఇకపై అదే పేరు
జూన్ 20న భారత్, ఇంగ్లండ్ మధ్య ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్‌కు టెండూల్కర్-అండర్సన్ సిరీస్‌గా నామకరణం చేసేందుకు నిర్వాహకులు సిద్దమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ సిరీస్‌కు పాత పేరు పటౌడీ సిరీస్‌గానే పిలవాలని బీసీసీఐ, ఈసీబీ నిర్ణయించాయి. ఈ సిరీస్‌కు పాత పేరునే కొనసాగించాలని నిర్వాహకులని సచిన్ టెండూల్కర్ కోరారు. దీంతో నిర్వాహకులు ఆ పేరునే కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు.