CRICKET: భారత్ ఘోర ఓటమి
చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్... భారత గడ్డపై టెస్ట్ సిరీస్ కైవసం;
భారత్‌తో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 245 పరుగులకు ఆలౌటైంది. బ్యాటింగ్‌లో జైస్వాల్ (77) రాణించగా.. మిగతావారు భారీ స్కోర్లు చేయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లతో చెలరేగిన మిచెల్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్ గెలుపుతో మూడు టెస్టుల సిరీస్‌ను కివీస్ 2-0తో కైవసం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, స్పిన్నర్ శాంట్నర్ మొత్తంగా 13 వికెట్లతో భారత్‌కు ఓటమి రుచి చూపించాడు. 359 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 245 రన్స్‌కు ఆలౌటైంది. ఓపెనర్ జైస్వాల్ (77), జడేజా (42) మాత్రమే రాణించారు. శాంట్నర్ 6, ఎజాజ్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు శనివారం మూడోరోజు కివీస్ రెండో ఇన్నింగ్స్ గంటలోనే ముగిసింది. జడేజా (3/72) టెయిలెండర్ల పనిబట్టడంతో కివీస్ 255 రన్స్‌కు ఆలౌటైంది. ఫిలిప్స్ (48 నాటౌట్), బ్లండెల్ (41) ఆకట్టుకున్నారు. సుందర్‌కు 4, అశ్విన్‌కు 2 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 259, భారత్ 156 రన్స్ చేశాయి. ఆఖరి టెస్టు వచ్చేనెల 1 నుంచి ముంబైలో జరుగుతుంది.
కివీస్ కొత్త చరిత్ర
టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించి 2-0తో సిరీస్ కైవసం చేసుకొని న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. భారత గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ చరిత్రలో విదేశీ గడ్డపై కివీస్ టెస్టు సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి. అటు 2012 నుంచి స్వదేశంలో వరుసగా 18 టెస్టు సిరీస్‌లు సాధించిన భారత్.. పుష్కరకాలం తర్వాత సిరీస్‌ను కోల్పోవడం గమనార్హం.
యశస్వి అరుదైన రికార్డు
టీమిండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 30 కంటే ఎక్కువ సిక్స్‌లు బాదిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో జైస్వాల్ ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్ అందుకున్న రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో కివీస్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్‌కల్లమ్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు 2014లో 33 సిక్సర్లు కొట్టాడు.
ఓటమిపై రోహిత్ ఆసక్తికర కామెంట్స్
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఓటమిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. ‘ఇది మాకు చాలా నిరాశ కలిగించింది. ఈసారి మేము అనుకున్నట్లు జరగలేదు. కొన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో మేము విఫలమయ్యాం. బ్యాటర్లు అందరూ మెరుగైన ప్రదర్శన చేయలేదు. న్యూజిలాండ్ అద్భుతంగా ఆడింది’ అని రోహిత్ చెప్పుకొచ్చారు. మూడో టెస్టులో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తామని రోహిత్ ఆశాభావం వ్యక్తం చేశారు.