DHONI: ఐపీఎల్‌పై ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు

కెరీర్ చివరి దశలో ఉందని ఒప్పుకున్న మిస్టర్ కూల్... రిటైర్మెంట్‌పై ఇప్పుడే ఏం చెప్పలేమన్న ధోనీ;

Update: 2025-05-08 06:00 GMT

తన ఐపీఎల్ కెరీర్‌పై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నా కెరీర్‌లో ఇప్పటివరకు అభిమానుల ప్రేమ, ఆప్యాయతను పొందడం బాగుంది. నాకు ఇప్పుడు 43 ఏళ్లు అని మరిచిపోను. చాలాకాలం నుంచి ఆడాను. అయితే, అభిమానుల్లో చాలామందికి నా చివరి సీజన్‌ ఎప్పుడు అనే విషయం తెలియదు. అందుకే, నా ఆటను చూసేందుకు మైదానాలకు వస్తున్నారు. సంవత్సరంలో నేను కేవలం 2 నెలలు మాత్రమే క్రికెట్ ఆడుతున్నా. మిగిలిన ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు తన శరీరాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని, ఈ ఒత్తిడిని అది తట్టుకోగలదా లేదా అనేది చూడాలని అన్నాడు. ’ అని ధోనీ తెలిపాడు.

మోకాలి నొప్పితో ధోనీ

ప్రస్తుతం ధోనీ మోకాలి సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడని, అందువల్ల ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయలేకపోతున్నాడని సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గతంలో చెప్పాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో డెవాల్డ్ బ్రెవిస్ ఔటయ్యాక 13వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన ధోనీ.. శివమ్ దూబేకు సహకరిస్తూ చివర్లో కీలక సిక్సర్‌తో జట్టును గెలిపించాడు.

కెరీర్ చివరి దశలో ధోనీ

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుపై 2 వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన కెరీర్ చివరి దశలో ఉందని ఒప్పుకున్నాడు. అయితే వెంటనే రిటైర్ అయ్యే ఉద్దేశం లేదని, కాలక్రమేణా నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. ఈ విజయంతో చెన్నై 4 మ్యాచ్‌ల వరుస పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. ఆ తర్వాత ఫ్యాన్స్ ఇచ్చిన మద్దతును ధోని ప్రశంసిస్తూ.. ప్రస్తుత సీజన్ చివరిలో రిటైర్ అయ్యే ఉద్దేశం తనకు లేదని సూచించాడు.

ధోనీ అరుదైన ఘనత

చెన్నై కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధికసార్లు(100) నాటౌట్‌గా నిలిచిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. బుధవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 17 పరుగులు చేసి అజేయంగా నిలిచిన ధోనీ ఈ రికార్డును సాధించాడు. మరోవైపు నిన్న చెన్నై విజయం సాధించినప్పటికీ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇప్పటికే ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది.

ఆ వార్త విని షాక్‌ అయ్యా: రహానె

రోహిత్ రిటైర్‌మెంట్‌ ప్రకటించిన వార్త విని తాను షాక్ అయ్యానంటూ కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానె కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నాకు నిజంగా రోహిత్ టెస్టు మ్యాచ్‌లకు రిటైర్‌మెంట్ ప్రకటించాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలీదు. ఉన్నట్టుండి హిట్‌మ్యాన్ టెస్ట్ మ్యాచ్‌కు వీడ్కోలు పలికాడనే వార్త వినగా షాక్‌ అయ్యాను’ అని రహనే తెలిపాడు.

Tags:    

Similar News