IPL: ఐపీఎల్‌లో ఆడాలని ఉందంటున్న పాక్ క్రికెటర్

బ్రిటన్ పౌరసత్వం వచ్చాక ఆడతానని వెల్లడి... ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్..!;

Update: 2025-03-09 03:30 GMT

పాక్ మాజీ క్రికెటర్ మహ్మద్ అమీర్ 2026 ఐపీఎల్‌లో ఆడాలనే ఉందని తన మనస్సులోని మాటను వ్యక్తం చేశాడు. రాజకీయ కారణాలతో పాక్ ప్లేయర్లకు ఐపీఎల్‌లో ఆడే అవకాశం లేకపోయినా, తన భార్య బ్రిటన్‌కు చెందినదని, త్వరలో ఆ దేశ పౌరసత్వం పొందనున్నట్లు అమీర్ వెల్లడించాడు. బ్రిటిష్ పౌరసత్వం పొందిన తరువాత IPLలో ఆడే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, అతనికి ఏ జట్టు అవకాశం కల్పిస్తుందో చూడాలి.

ముంబై అబిమానులకు బ్యాడ్ న్యూస్

ముంబై ఇండియన్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఐపీఎల్ 2025కు ముందు ముంబై ఇండియన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ టీమ్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి నుంచి ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. దీంతో ఐపీఎల్ కు తొలి రెండు వారాల పాటు బుమ్రా దూరం కానున్నాడని సమాచారం. అంటే ముంబై ఆడే తొలి నాలుగైదు మ్యాచ్ లకు జస్ప్రీత్ బుమ్రా మిస్ అవుతాడని తెలుస్తోంది. ఏప్రిల్ లో ముంబై ఇండియన్స్ జట్టులో చేరే అవకాశం ఉంది.

అత్యంత కఠినమైన బౌలర్ బుమ్రా: విలియమ్సన్

న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్ నేడు జరిగే ఛాంపియన్స్ కప్ క్రికెట్ సిరీస్ ఫైనల్లో ఆడబోతున్నాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ.. 'నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. అలాగే సచిన్, కోహ్లి కూడా పటిష్టమైన బ్యాటర్లు. భారత ఆటగాళ్ల నుంచి ఎప్పుడూ కఠినమైన పోటీ ఎదుర్కొవాల్సి వస్తుంది.' అని కేన్ వెల్లడించాడు.

ప్లేఆఫ్‌కు అర్హత సాధించిన జట్లు ఖరారు

వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌ 2025లో ప్లేఆఫ్ పోటీల్లో పోరు ఉత్కంఠగా మారింది. నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమితో ఆ జట్టు ప్లేఆఫ్ అవకాశం కోల్పోయింది. అంతకుముందే యూపీ వారియర్స్ కూడా నిష్క్రమించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ ప్లేఆఫ్‌కు చేరుకున్నాయి. ముంబైకు 2 లీగ్ మ్యాచ్‌లు, గుజరాత్‌కు ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఈ మ్యాచ్‌ల ఫలితాలను బట్టి ఎలిమినేటర్, ఫైనల్ ఆడే జట్లు ఖరారవుతాయి.

Tags:    

Similar News