పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది వన్డే క్రికెట్లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. 65 వన్డేల్లోనే అత్యధిక వికెట్లు (131) పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. వెస్ట్ విండీస్‌పై 4 వికెట్లు పడగొట్టి ఈ ఫీట్ సాధించాడు. దీంతో 65 వన్డేల్లో అత్యధిక వికెట్లు (128) తీసిన ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌కు ముందు 64 వన్డేల్లో 127 వికెట్లతో ఉన్న షాహీన్, విండీస్‌పై 4 వికెట్లు పడగొట్టి తన మొత్తం వికెట్ల సంఖ్యను 131కి చేర్చుకున్నాడు. దీంతో 65 వన్డేల తర్వాత అత్యధిక వికెట్లు (128) తీసిన ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రికార్డును అతను అధిగమించాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే, టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్.. వెస్టిండీస్‌ను 280 పరుగులకు కట్టడి చేసింది. విండీస్ బ్యాటర్లలో ఎవిన్ లూయిస్ (60), కెప్టెన్ షాయ్ హోప్ (55), రోస్టన్ చేజ్ (53) అర్ధ సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో షాహీన్ 51 పరుగులిచ్చి 4 వికెట్లతో చెలరేగగా, నసీమ్ షా 3 వికెట్లు పడగొట్టాడు.
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను పాకిస్తాన్ శుభారంభం చేసింది. ట్రినిడాడ్‌లో శనివారం జరిగిన తొలి వన్డేలో పాక్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే ఆలౌటైంది. 49 ఓవర్లలో 280 పరుగులు చేసి కుప్పకూలింది. లెవిస్(60), కెప్టెన్ షాయ్ హోప్(55), రోస్టన్ చేజ్(53) హాఫ్ సెంచరీలు చేయగా.. షెఫెర్డ్(31) కూడా రాణించాడు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 4 వికెట్లు, నసీమ్ షా 3 వికెట్లతో కరేబియన్ జట్టు పతనాన్ని శాసించారు. అయితే, పాక్ ముందు 281 పరుగుల టఫ్ టార్గెట్‌ను విండీస్ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ఆ లక్ష్యాన్ని పాకిస్తాన్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హసన్ నవాజ్(63 నాటౌట్) అరంగేట్ర మ్యాచ్‌లోనే సత్తాచాటాడు. చివరి వరకూ నిలిచి పాక్‌ను గెలిపించాడు. అతనికితోడు రిజ్వాన్(53), హుస్సేన్ తలత్(41 నాటౌట్), బాబర్ ఆజామ్(47) సత్తాచాటడంతో పాక్ 48.5 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో పాక్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆదివారం రెండో వన్డే జరగనుంది. పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది వన్డే క్రికెట్లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. 65 వన్డేల్లోనే అత్యధిక వికెట్లు (131) పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు.