PCB:షేక్ హ్యాండ్ వివాదం.. అధికారిపై వేటు

అందుకే కరచాలనం చేయలేదు: సూర్యకుమార్

Update: 2025-09-16 06:30 GMT

భా­ర­త్‌-పా­క్‌ ఆట­గా­ళ్ల హ్యాం­డ్‌ షే­క్‌ వి­వా­దం­లో అనూ­హ్య పరి­ణా­మం చోటు చే­సు­కుం­ది. పా­కి­స్తా­న్‌ క్రి­కె­ట్‌ బో­ర్డు వి­ష­యా­న్ని సరి­గ్గా హ్యాం­డి­ల్‌ చే­య­లే­క­పో­యా­డ­ని సొంత అధి­కా­రి­నే సస్పెం­డ్‌ చే­సిం­ది. జట్టు క్రి­కె­ట్‌ ఆప­రే­ష­న్ష్‌ డై­రె­క్ట­ర్‌ ఉస్మా­న్‌ వా­హ్లా­పై పీ­సీ­బీ సస్పె­న్ష­న్‌ వేటు వే­సిం­ది. అధ్య­క్షు­డు నఖ్వీ బో­ర్డు అత్య­వ­సర సమా­వే­శం ని­ర్వ­హిం­చి వా­హ్లా­ను సస్పెం­డ్ చే­సి­న­ట్లు తె­లు­స్తోం­ది. "ఈ వి­ష­యా­న్ని హ్యాం­డి­ల్‌ చేసే వి­ష­యం­లో వా­హ్లా నుం­చి ఎక్కు­వ­గా ఆశిం­చా­ము. అయి­తే అతను ని­రా­శ­ప­రి­చా­డు. వా­హ్లా కా­ర­ణం­గా భా­ర­త్‌ ముం­దు పా­క్‌ పరు­వు పో­యిం­ది. టా­స్‌­కు ముం­దే మ్యా­చ్ రి­ఫ­రీ కర­చా­ల­నం వి­ష­యా­న్ని ప్ర­స్తా­విం­చి­నా, వా­హ్లా పరి­స్థి­తి­ని ని­యం­త్రిం­చ­డం­లో వి­ఫ­ల­మ­య్యా­డు" అని పీ­సీ­బీ చీఫ్ వ్యా­ఖ్యా­నిం­చి­న­ట్లు తె­లు­స్తోం­ది.

ఈ వి­ష­యం­పై పీ­సీ­బీ నానా యాగీ చే­స్తుం­ది. భారత ఆట­గా­ళ్ల­పై చర్య­లు తీ­సు­కో­వా­ల­ని ఐసీ­సీ­కి ఫి­ర్యా­దు చే­సిం­ది. మ్యా­చ్‌ రి­ఫ­రీ పై­క్రా­ఫ్ట్‌­ను ఆసి­యా కప్‌ వి­ధుల నుం­చి తొ­ల­గిం­చా­ల­ని డి­మాం­డ్‌ చే­సిం­ది. భారత ఆట­గా­ళ్లు క్రీ­డా­స్పూ­ర్తి­కి వి­రు­ద్దం­గా ప్ర­వ­ర్తిం­చా­ర­ని నీ­తు­లు చె­బు­తుం­ది. డి­మాం­డ్ల­ను పరి­ష్క­రిం­చ­క­పో­తే యూ­ఏ­ఈ­తో తదు­ప­రి జరు­గ­బో­యే మ్యా­చ్‌­ను బహి­ష్క­రి­స్తా­మ­ని బ్లా­క్‌ మె­యి­ల్‌ చే­స్తుం­ది.

పా­క్‌­తో జరి­గిన మ్యా­చ్‌­లో భారత ఆట­గా­ళ్లు ప్ర­త్య­ర్థి టీం సభ్యు­ల­ను అస్స­లు పట్టిం­చు­కో­లే­దు. పల­క­రిం­పు­లు, నవ్వు­లు, కర­చా­ల­నా­లు వం­టి­వే­మీ లే­కుం­డా ఆట ము­గిం­చా­రు. తమ పని తాము చే­సు­కు­ని మై­దా­నా­న్ని వీ­డా­రు. ఈ వి­ష­యం­పై టీ­మిం­డి­యా కప్టె­న్ సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్ తా­జా­గా వి­వ­రణ ఇచ్చా­రు. పాక్ క్రీ­డా­కా­రు­ల­కు టీ­మిం­డి­యా సభ్యు­లు షేక్ హ్యాం­డ్ ఇవ్వ­క­పో­వ­డం­పై ఓ వి­లే­క­రి సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్‌­ను ప్ర­శ్నిం­చా­రు. ఇది క్రీ­డా స్ఫూ­ర్తి­కి వి­రు­ద్ధం కాదా అని ప్ర­శ్నిం­చా­రు. దీ­ని­కి సూ­ర్య­కు­మా­రు సూ­టి­గా జవా­బి­చ్చా­రు. కొ­న్ని అం­శా­లు క్రీ­డా­స్ఫూ­ర్తి­కం­టే ము­ఖ్య­మై­న­వ­ని కుం­డ­బ­ద్ద­లు కొ­ట్టా­రు. ‘జీ­వి­తం­లో కొ­న్ని అం­శా­లు క్రీ­డా­స్ఫూ­ర్తి­కం­టే ము­ఖ్య­మై­న­వి. పహ­ల్గాం దాడి బా­ధి­తు­ల­కు మేము అం­డ­గా ఉం­టా­ము. కా­బ­ట్టి, ఈ వి­జ­యా­న్ని మేము ఆప­రే­ష­న్ సిం­దూ­ర్‌­లో పా­ల్గొ­న్న సా­యుధ దళా­ల­కు అం­కి­తం ఇస్తు­న్నా­ము’ అని అన్నా­రు

స్పందించిన పాక్‌ కోచ్‌

అవా­ర్డుల ప్ర­దా­నం తరు­వాత కా­ర్య­క్ర­మం­లో పాక్ కె­ప్టె­న్ సల్మా­న్ ఆఘా పా­ల్గొ­న­లే­దు. ఈ వి­ష­య­మై పాక్ హెడ్ కోచ్ మైక్ హె­స్స­న్ స్పం­దిం­చా­రు. టీ­మిం­డి­యా సభ్యు­లు తమతో కర­చా­ల­నం చే­య­క­పో­వ­డం పాక్ జట్టు సభ్యు­ల­ను ని­రా­శ­ప­రి­చిం­ద­ని అన్నా­రు. ఈ క్ర­మం­లో­నే సల్మా­న్ కూడా మ్యా­చ్ తరు­వాత జరి­గిన వే­డు­క­కు వె­ళ్ల­లే­ద­ని చె­ప్పా­రు. పహ­ల్గాం దాడి తరు­వాత పా­క్‌­తో మ్యా­చ్‌­కు అం­గీ­క­రిం­చి­నం­దు­కు బీ­సీ­సీ­ఐ­పై వి­మ­ర్శ­లు వె­ల్లు­వె­త్తిన వి­ష­యం తె­లి­సిం­దే. అయి­తే, పా­క్‌­తో ద్వై­పా­క్షిక సి­రీ­స్‌­లు ఉం­డ­వ­ని బీ­సీ­సీఐ స్ప­ష్టం చే­సిం­ది. పా­క్‌­తో పాటు ఇతర దే­శాల జట్లు కూడా ఆడే టో­ర్నీ­ల్లో భా­ర­త్ పా­లు­పం­చు­కుం­టుం­ద­ని వి­వ­రణ ఇచ్చిం­ది.

Tags:    

Similar News