PKL: వచ్చేస్తోంది..ప్రో కబడ్డీ లీగ్

ఆగస్టు 29న పీకేఎల్ ఆరంభం.. 12 జట్లు తలపడే మెగా లీగ్.. ఈసారి విశాఖలోనూ పోటీలు;

Update: 2025-08-01 05:00 GMT

కబ­డ్డీ అభి­మా­ను­లు ఎంతో ఆస­క్తి­గా ఎదు­రు­చూ­స్తు­న్న ప్రో కబ­డ్డీ లీగ్ (పీ­కే­ఎ­ల్) 12వ సీ­జ­న్‌ ఆరం­భా­ని­కి సమయం సమీ­పి­స్తోం­ది. ఆగ­ష్టు 29న ప్రా­రం­భం కా­ను­న్న ఈ మెగా కబ­డ్డీ టో­ర్న­మెం­ట్‌­ను నా­లు­గు ప్ర­ధాన నగ­రా­ల్లో ని­ర్వ­హిం­చ­ను­న్నా­రు. ఈసా­రి వై­జా­గ్, జై­పూ­ర్, చె­న్నై, ఢి­ల్లీ నగ­రా­లు 12 జట్లు తల­ప­డే ఈ మెగా లీ­గ్‌­కు ఆతి­థ్యం ఇచ్చేం­దు­కు సి­ద్ధ­మ­య్యా­యి. ఈ సారి వై­జా­గ్‌­లో పీ­కే­ఎ­ల్‌­కు తె­ర­లే­వ­నుం­ది. 7ఏళ్ల తర్వాత వి­శా­ఖ­ప­ట్నం­లో పీ­కే­ఎ­ల్ మ్యా­చ్‌­లు జర­గ­బో­తు­న్నా­యి. చి­వ­రి­సా­రి­గా 2018లో పీ­కే­ఎ­ల్‌­కు వై­జా­గ్ ఆత­థ్య­మి­చ్చిం­ది. 12 జట్లు టై­టి­ల్ కోసం పో­టీ­ప­డ­ను­న్నా­యి. వై­జా­గ్‌­లో­ని రా­జీ­వ్ గాం­ధీ ఇం­డో­ర్ స్టే­డి­యం­లో టో­ర్నీ ప్రా­రం­భం­కా­నుం­ది. ఆగ­స్టు 29న జరి­గే ఓపె­నిం­గ్ మ్యా­చ్‌­లో తమి­ళ్ తలై­వా­స్‌­తో తె­లు­గు టై­టా­న్స్ తల­ప­డ­నుం­ది. అదే రోజు బెం­గ­ళూ­రు బు­ల్స్, పు­ణే­రి పల్టా­న్స్ మధ్య రెం­డో గేమ్ జర­గ­నుం­ది.

డిఫెండింగ్ చాంపియన్ హర్యానా స్టీలర్స్ ఆగస్టు 31న తన తొలి మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్‌ను ఎదుర్కోనుంది. మొత్తం టోర్నీలో 108 లీగ్ దశ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందుకు నాలుగు వేదికలను నిర్వాహకులు ఎంపిక చేశారు. వైజాగ్, జైపూర్, చెన్నయ్, ఢిల్లీలను వేదికలుగా ఖరారు చేశారు. వైజాగ్‌లో ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 11 వరకు, జైపూర్‌లో సెప్టెంబర్ 12 నుంచి 28 వరకు, చెన్నయ్ వేదికగా సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12 వరకు, ఢిల్లీ వేదికగా అక్టోబర్ 13 నుంచి 23 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు, వేదికలు తర్వాత ప్రకటించనున్నారు.

ఇదో కొత్త అధ్యాయం

ప్రో కబ­డ్డీ లీగ్ కమి­ష­న­ర్ అను­ప­మ్ గో­స్వా­మి మా­ట్లా­డు­తూ, "ప్రో కబ­డ్డీ లీగ్ ఎదు­గు­ద­ల­లో 12వ సీ­జ­న్ ఒక కొ­త్త అధ్యా­యం. ఈ మల్టీ-సిటీ ఫా­ర్మా­ట్ ద్వా­రా దే­శ­వ్యా­ప్తం­గా ఉన్న అభి­మా­నుల వద్ద­కు అత్యు­త్తమ కబ­డ్డీ యా­క్ష­న్‌­ను తీ­సు­కు­వె­ళ్తు­న్నాం. ము­ఖ్యం­గా ఈ ఆటకు మంచి ఫ్యా­న్ బేస్ ఉన్న వి­శా­ఖ­ప­ట్నం­కు తి­రి­గి రా­వ­డం మాకు చాలా ఆనం­దం­గా ఉంది" అని అన్నా­రు. కాగా 12వ సీ­జ­న్ ప్లే ఆఫ్స్ షె­డ్యూ­ల్‌­ను త్వ­ర­లో ప్ర­క­టిం­చ­ను­న్నా­రు. అమె­చ్యూ­ర్ కబ­డ్డీ ఫె­డ­రే­ష­న్ ఆఫ్ ఇం­డి­యా (ఏకే­ఎ­ఫ్ఐ) ఆధ్వ­ర్యం­లో మషల్ స్పో­ర్ట్స్, జి­యో­స్టా­ర్ కలి­సి ఈ లీ­గ్‌­ను దే­శం­లో అత్యంత వి­జ­య­వం­త­మైన స్పో­ర్ట్స్ లీ­గ్స్ లో ఒక­టి­గా ని­ల­బె­ట్టా­యి. ప్రో కబ­డ్డీ లీగ్ మ్యా­చ్‌­లు స్టా­ర్ స్పో­ర్ట్స్ నె­ట్‌­వ­ర్క్‌­లో ప్ర­త్య­క్ష ప్ర­సా­రం కా­ను­న్నా­యి. జియో హా­ట్‌­స్టా­ర్‌ లో లైవ్ స్ట్రీ­మ్ అవు­తా­యి.

వై­జా­గ్‌­లో తొలి అంచె ము­గి­సిన తర్వాత సె­ప్టెం­బ­ర్ 12 నుం­చి జై­పూ­ర్‌­లో­ని సవా­య్ మా­న్‌­సిం­గ్ ఇం­డో­ర్ స్టే­డి­యం­లో మ్యా­చ్‌­లు ప్రా­రం­భ­మ­వు­తా­యి. ఇక్కడ జరి­గే తొలి పో­రు­లో జై­పూ­ర్ పిం­క్ పాం­థ­ర్స్, బెం­గ­ళూ­రు బు­ల్స్‌­తో తల­ప­డ­నుం­ది. 10వ సీ­జ­న్‌­లో చా­రి­త్రా­త్మక 1000వ మ్యా­చ్‌­కు జై­పూ­ర్ ఆతి­థ్యం ఇచ్చిం­ది. సె­ప్టెం­బ­ర్ 29 నుం­చి చె­న్నై­లో­ని ఎస్‌­డీ­ఏ­టీ మల్టీ­ప­ర్ప­స్ ఇం­డో­ర్ స్టే­డి­యం­లో మూడో లెగ్ ప్రా­రం­భ­మ­వు­తుం­ది. ఇక్కడ దబాం­గ్ ఢి­ల్లీ కేసీ.. హర్యా­నా స్టీ­ల­ర్స్‌­తో తల­ప­డ­నుం­ది. ఈ మ్యా­చ్‌­లో స్టా­ర్ రై­డ­ర్ నవీ­న్ కు­మా­ర్ తన మాజీ జట్టు­పై పో­టీ­ప­డ­నుం­డ­టం ఆస­క్తి రే­పు­తోం­ది.

Tags:    

Similar News