PUJARA: పుజారా... ఓ పోరాట యోధుడు
టెస్టు క్రికెట్ పర్యాయపదం చతేశ్వర్ పుజారా;
పుజారా సవాళ్లకు ఎదురు నిలిచే రకం. భయంకర బౌలర్లనూ ప్రశాంతంగా ఎదుర్కొనే వీరుడు అతను. అతను అడిలైడ్‌లో 123తో సిరీస్‌ను ప్రారంభించాడు, సిడ్నీలో 193తో ముగించాడు. ఆ బోర్డర్-గావస్కర్ ట్రోఫీని అందుకున్న తర్వాత మొత్తం జట్టు ఎస్సీజీ అవుట్‌ఫీల్డ్‌లో పుజారా డ్యాన్స్ చేసింది. మళ్ళీ ఇండియాలో నాలుగు టెస్ట్ సిరీస్ కొనసాగుతున్నప్పుడు సీనియర్ ఆటగాళ్ల వికెట్లు టపటపా పడిపోయాయి. కానీ పుజారా మళ్లీ క్రీజులో పాతుకుపోయాడు.
సచిన్, గవాస్కర్‌కు సాధ్యం కానీ రికార్డ్..
సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీలకు సాధ్యం కానీ రికార్డ్ అందుకున్నాడు. అంతేకాకుండా గత 40 ఏళ్లలో టెస్ట్ క్రికెట్లో ఐదు రోజులూ బ్యాటింగ్ చేసిన తొలి భారత ఆటగాడిగా కూడా పుజారా చరిత్రకెక్కాడు. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా(సెనా) దేశాలపై అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లను గెలిచిన భారత ఆటగాడిగా కూడా పుజారా ఘనతను అందుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో పుజారా మాత్రమే 1258 బంతులు ఎదుర్కొన్నాడు. ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్‌లు టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా.. పుజారా కూడా ఈ జాబితాలో చేరాడు. అజింక్యా రహానే ఒక్కడే మిగిలాడు. అతను కూడా తప్పుకుంటే టెస్ట్‌ల్లో ఓ శకం ముగుస్తోంది. భారత టెస్టు క్రికెట్లో మూడు తరం ప్లేయర్లు 'వాల్'గా గుర్తించారు. గావస్కర్, ద్రవిడ్ తర్వాత, ఇప్పుడు పుజారా మూడో స్థానంలో 'నయా వాల్'గా నిలిచాడు. 100 కంటే ఎక్కువ టెస్టుల్లో భారతకు వెన్నెముకగా పనిచేశాడు.
మూడో ప్లేయర్‌గా
103 టెస్టుల్లో 7,000+ పరుగులు సాధించి, ఐదు రోజులూ బ్యాటింగ్ చేసిన మూడో భారత ప్లేయర్‌గా నిలిచాడు. 2017లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. ఆరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, రెండు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలిచాడు. 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ తర్వాత జట్టుకు దూరమయ్యాడు, కానీ 'మూడో' స్థానం భర్తీ ఇప్పటికీ కొనసాగుతుంది. చతేశ్వర్ పుజారా 'నయా వాల్'గా తన స్థానాన్ని బలంగా కొనసాగించాడు. కొత్త తరంపై దృష్టి పెట్టినా, అతడి స్థానాన్ని భర్తీ చేయడానికి ఎదురు ఆటగాడు ఎవరు అవుతారో చూడాల్సి ఉంది. టెస్ట్ క్రికెట్లో పుజారా ఆరుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ను, రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్స్‌ను గెలుచుకున్నాడు. 2006లో జరిగిన అండర్ 19 ప్రపంచకప్‌లోనూ పుజారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. 2013లో ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్, 2018లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో 500 బంతులు ఎదుర్కొన్న ఏకైక ఆటగాడిగా కూడా పుజారా చరిత్ర సృష్టించాడు.