టీమిండియాకు మళ్లీ ఆడాలని ఉందనే కోరికను మాజీ ప్లేయర్ అజింక్య రహానే భయటపెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో.. ‘నేను ఇంకా టెస్ట్ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నాను. టెస్ట్ క్రికెట్ పట్ల నాకు చాలా ఆసక్తి ఉంది. నేను నియంత్రించగలిగే విషయాలపై దృష్టి సారించడమే నా పని. నిజం చెప్పాలంటే, భారత జట్టు సెలక్షన్ కమిటీతో మాట్లాడటానికి ప్రయత్నించాను. కానీ ఎటువంటి స్పందన రాలేదు. నేను నిరంతరం ఆడగలను’ అని చెప్పుకొచ్చారు. 37 ఏళ్ల రహానే ఆస్ట్రేలియాతో జరిగిన 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. వెస్టిండీస్ పర్యటన తర్వాత జట్టు నుంచి తొలగించబడిన అజింక్య రహానే.. మళ్లీ స్థానం సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇందు కోసం ముంబై జట్టులో చేరి దేశీయ మ్యాచ్‌లపై దృష్టి సారించాడు. రహానే.. మళ్లీ స్థానం సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ముంబై జట్టులో చేరి దేశీయ మ్యాచ్‌లపై దృష్టి సారించాడు.
బ్రూక్ బ్యాటింగ్‌పై సంగక్కర ఘాటు విమర్శలు
ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ బ్యాట్స్ మెన్ గా బ్రూక్ ఆట తీరు సరిగ్గా లేదని సంగక్కర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘స్పిన్ బౌలింగ్ లో ఆడాల్సిన స్వీప్ షాట్‌ను పేసర్ వేస్తున్నప్పుడు ఆడటం కరెక్ట్ కాదు. లంచ్ కి పదిహేను నిమిషాల ముందు ఇలాంటి దూకుడైన ఆట తెలివైన బ్యాటింగ్ కాదు’ అని పేర్కొన్నాడు. చివరి 19 బంతుల్లో 23 పరుగులు చేసిన బ్రూక్ పెవిలియన్ బాట పట్టాడు. “ఇది కేవలం అహంకారం. బజ్‌బాల్ కూడా కాదు” అని సంగక్కర మండిపడ్డాడు. లార్డ్స్ టెస్ట్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్, ఇంగ్లాండ్ రెండూ సరిగ్గా 387 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను భారత్ కట్టడి చేస్తోంది. నాలుగో రోజు తొలి సెషన్ లో నాలుగు వికెట్లు (బెన్ డకెట్, ఒలీ పోప్, జాక్ క్రాలీ, బ్రూక్) తీశారు. ఇంగ్లాండ్‌ను 98/4కి కుదించారు. సిరాజ్ మొదటి రెండు వికెట్లు పడగొట్టాడు. నితీష్ కుమార్ రెడ్డి, ఆకాశ్ ఒక్కో వికెట్ తీశారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే మ్యాచ్ డ్రాగా ముగిసేలా కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీ చేశాడు. కానీ ఆధిక్యం సంపాదించుకునే అవకాశాన్ని భారత్ చేజేతులా వదిలేసుకుంది.