Viral: చాహర్ అలా ఆడమని చెప్పు..రాహుల్ ద్రవిడ్ సందేశం
Rahul Dravid: శ్రీలంకలో పర్యటిస్తున్న భారత జట్టు విజయాల పరంపర కొనసాగిస్తూనే ఉంది. రెండో వన్డేలో కాస్త తడబడిన టీమిండియా..;
Dravid
Rahul Dravid: శ్రీలంకలో పర్యటిస్తున్న భారత జట్టు విజయాల పరంపర కొనసాగిస్తూనే ఉంది. రెండో వన్డేలో కాస్త తడబడిన టీమిండియా.. ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో ఎట్టకేలకు విజయం వరించింది. అయితే ఈ మ్యాచ్ విజయం వెనక టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ పాత్ర చాలా కీలకమైంది. మిస్టర్ కూల్ మ్యాచ్ ఎలా ఉన్నా చాలా ప్రశాంతంగానే కనిపిస్తాడు. శ్రీలంకతో రెండో వన్డేలో మాత్రం తొలిసారి ద్రవిడ్ కాస్త ఆందోళన చెందినట్టు కనిపించింది.
మ్యాచ్ చివరి క్షణాల్లో వెంటనే డ్రస్సింగ్ రూమ్ నుంచి డగౌట్‌కు చేరుకున్నాడు. జట్టు విజయంలో కీలకంగా మారిన ఆల్ రౌండర్ దీపక్ చాహర్ గ్రౌండ్ లో ఉన్నాడు. అతని తమ్ముడు రాహుల్ చాహర్ వద్దకు వచ్చిన ద్రవిడ్ ఏదో సందేశం పంపించాడు. ద్రవిడ్ డగౌట్లో రాహుల్ తో మాట్లాడుతున్న కనిపించడం మాత్రం వైరల్‌గా మారింది.
అయితే దీపక్ చాహర్ రజిత వేసిన 44వ ఓవర్లో రిస్కీ షాట్లు ఆడాడు. ఓవర్లు దగ్గర పడుతుండటం, ఉత్కంఠ పెరగడంతో మ్యాచును ముందుగా ముగించేద్దామని భావించాడు. అక్కడే కూర్చున్న రాహుల్ చాహర్‌తో ద్రవిడ్ మాట్లాడాడు. హసరంగ మూడు వికెట్లు తీసి ప్రమాదకరంగా మారాడు. అతని బౌలింగ్‌లో షాట్లు ఆడొద్దని ద్రవిడ్ సూచించారు. 47వ ఓవర్లో దీపక్‌కు తిమ్మిర్లు రావడంతో ఫిజియోతో పాటు రాహుల్ చాహర్ అక్కడికి చేరుకొన్నాడు.
ద్రవిడ్ సందేశాన్ని సోదరుడికి అందించాడు. ఆ తర్వాత హసరంగ వేసిన 2 ఓవర్లలో ఢిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశారుు. మిగతా వాళ్ల బౌలింగ్‌లో పరుగులు రాబట్టి విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 276 పరుగుల లక్ష్య్ం ఛేదనలో టీమ్‌ఇండియా 160కే 6 వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన దీపక్ చాహర్ (69-), భువనేశ్వర్(19*)తో కలిసి జట్టుకు విజయం అందించాడు.