RAHUL: కేఎల్ రాహుల్ అద్భుత శతకం
భారత స్టార్ ప్లేయర్ అద్భుతమైన సెంచరీతో అదరగొట్టిన కేఎల్ రాహుల్;
ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ ఫామ్‌లోకి వచ్చాడు. భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో టీమిండియా-ఏ జట్టు ఇంగ్లాండ్ లయన్స్‌తో తలపడుతోంది.ఈ మ్యాచ్‌లో భారత స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 150 బంతుల్లోనే మూడంకెల మార్కు అందుకున్నాడు. 165 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి 111 పరుగులు చేశాడు. దీంతో 60 ఓవర్లు ముగిసేసరికి భారత్ 267 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది.
ఈ మ్యాచ్ నార్తాంప్టన్ వేదికగా శుక్రవారమే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ లయన్స్.. ఇండియా ఏకు బ్యాటింగ్ అప్పగించింది. రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇకపై అతడి స్థానాన్ని కేఎల్ రాహుల్ భర్తీ చేస్తాడనే అంచనాలు ఉన్నాయి. వాటికి తగ్గట్లుగానే ఈ మ్యాచ్‌లో రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. యశస్వి జైశ్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. 17 పరుగులు చేసిన అనంతరం జైశ్వాల్.. తొలి వికెట్ రూపంలో ఔట్ అయ్యాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (11) కూడా త్వరగానే ఔట్ అయ్యాడు. ఈ దశలో కరుణ్ నాయర్ (40)తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. జట్టు స్కోరు 126 వద్ద కరుణ్.. మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఓ పక్క వికెట్లు పడుతున్న రాహుల్ మాత్రం సాధికారికంగా ఆడాడు.
డెడికేషన్ ముందే రాహుల్
నిజానికి ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ కోసం భారత జట్టు శుక్రవారం బయలు దేరింది. కానీ బీసీసీఐ పర్మిషన్ తీసుకుని రాహుల్.. జట్టుకంటే ముందే ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టాడు. ప్లాన్ ప్రకారం రెండో అనధికారిక టెస్టు బరిలోకి దిగాడు. అనుకున్నట్లుగానే సెంచరీ చేసి.. మంచి మ్యాచ్ ప్రాక్టీస్ పొందాడు. **ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌కు అవకాశం ఇచ్చేందుకు గత మ్యాచ్‌లో సత్తా చాటిన సర్ఫరాజ్ ఖాన్‌ను తప్పించారు.