కొంతమంది క్రికెటర్స్ ఇప్పటికే సినిమా రంగం వైపు అడుగులు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా కూడా సినిమాల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు నేషనల్ మీడియాలో కూడా కథనాలు ప్రచురణ అయ్యాయి. ఓ తమిళ సినిమాలో... సురేష్ రైనా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. CSK జట్టు తరఫున ఆడి సౌత్ లో రైనా బాగా పాపులర్ అయ్యాడు. అందుకే... సౌత్ ఇండియా నుంచి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారట. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున... దక్షిణాది రాష్ట్రాలలో సురేష్ రైనా బాగా పాపులర్ అయ్యారు. అందుకే... సౌత్ ఇండియా నుంచి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారట. ఇక ఇప్పటికే ఇర్ఫాన్ పఠాన్, శ్రీశాంత్, కపిల్ దేవ్, హర్భజన్ సింగ్ లాంటి వాళ్లు పలు సినిమాల్లో కనిపించిన సంగతి తెలిసిందే. వాళ్ల తరహాలోనే సినిమాలు చేయాలని సురేష్ రైనా అనుకుంటున్నారట. ఒకవేళ సినిమా మంచిగా హిట్ అయితే.. వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్లే ఛాన్సులు ఉన్నాయి.