IPL: పంజాబ్‌కు రాజస్థాన్ షాక్
50 పరుగుల తేడాతో రాజస్థాన్ చిత్తు... రాణించిన జైస్వాల్, పరాగ్;
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌కు తొలి దెబ్బ తగిలింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి మంచి ఫామ్‌లో కనిపించిన పంజాబ్‌కు.. రాజస్థాన్ షాక్ ఇచ్చింది. చండీగడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ను 50 పరుగుల తేడాతో రాజస్థాన్ చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 205 పరుగులు చేయగా.. రాజస్థాన్ 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసి పరాజయం పాలైంది.
మెరిసిన జైస్వాల్, పరాగ్
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 45 బంతులకు 67 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రియాన్ పరాగ్ 43 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సంజూ శామ్‌సన్ 38 పరుగులతో సత్తా చాటాడు. హెట్‌మేర్ (20), నితీశ్ రాణా (12), ధ్రువ్ జురేల్ (13) పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్‌లో చివరి 5 ఓవర్లలో పరాగ్, హెట్‌మయర్ (20) దంచికొట్టారు. కానీ 19వ ఓవర్లో అర్ష్ దీప్ 9 పరుగులు మాత్రమే ఇచ్చి, హెట్‌మయర్‌ను ఔట్ చేశాడు. స్టాయినిస్ వేసిన లాస్ట్ ఓవర్ రెండో బంతికి పరాగ్ కొట్టిన సిక్సర్ ఆకట్టుకుంది. ధ్రువ్ జురెల్ (13 నాటౌట్) వరుసగా 6, 4 కొట్టడంతో రాజస్థాన్ స్కోరు 200 దాటింది. దీంతో పంజాబ్ 205 పరుగులు చేసింది. ముల్లాన్‌పుర్ స్టేడియంలో ఐపీఎల్ లో ఓ టీమ్ స్కోర్ 200 దాటడం ఇదే తొలిసారి. పంజాబ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ 2 వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, మార్కో జెన్‌సన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
కట్టడి చేసిన ఆర్చర్
రాజస్థాన్ విధించిన 206 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ చేధించలేక చతికిలపడింది.ఛేజింగ్ లో పంజాబ్ కు ఫస్ట్ ఓవర్లోనే ఆర్చర్ షాకిచ్చాడు. ఫస్ట్ బాల్ కే ప్రియాన్ష్ ఆర్య ను బౌల్డ్ చేసిన ఆర్చర్.. లాస్ట్ బాల్ కు సూపర్ ఫామ్ లో ఉన్న కెప్టెన్ శ్రేయస్ (10) స్టంప్స్ ను లేపేశాడు. ఆ డబుల్ షాక్ తర్వాత పంజాబ్ కోలుకోలేకపోయింది. స్టాయినిస్ (1) కూడా ఫెయిల్ అయ్యాడు. అతణ్ని బోల్తా కొట్టించాడు సందీప్ శర్మ. పవర్ ప్లేలో 43/3తో నిలిచిన పంజాబ్.. ఆ వెంటనే ప్రభ్ సిమ్రన్ (17) వికెట్ కూడా కోల్పోయింది. 20 ఓవర్లకు 155 పరుగులు చేసింది. నేహల్ వధేరా 41 బంతుల్లో 62 పరుగులు చేయగా.. గ్లెన్ మాక్స్‌వెల్ (30), ప్రభుషిమ్రాన్‌సింగ్ (17) పర్వాలేదనిపించారు. చివరకు ఆ టీమ్ 155/9తో సరిపెట్టుకుంది. జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, మహీశ్ తీక్షణ తలా రెండు వికెట్లు తీశారు. కుమార్ కార్తీకేయ, వహిందు హసరంగా ఒక్కో వికెట్ పడగొట్టారు.