రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో భాగంగా జమ్మూ కాశ్మీర్‌తో జరిగే తొలి మ్యాచ్ కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ ఎంపికయ్యాడు. గాయం కారణంగా బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్‌కు దూరమైన స్టార్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. బీసీసీఐ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ రావడంతో సర్ఫరాజ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే టీమిండియా టీ20 కెప్టెన్, ముంబైకర్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుండడంతో జమ్మూతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ప్రాక్టీస్ గేమ్‌లో పాల్గొన్న చాలా మంది ఆటగాళ్లు ఈ 16 మంది సభ్యుల జట్టులో ఉన్నారు.
ముషీర్‌కు పృథ్వీ షా క్షమాపణలు
ముంబై, మహారాష్ట్ర రంజీ ట్రోఫీ వార్మాప్ మ్యాచ్‌లో ముషీర్ ఖాన్-పృథ్వీ షా మధ్య చోటు చేసుకున్న వివాదం ముగిసిపోయింది. ముషీర్‌కు పృథ్వీ క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. "పృథ్వీ షా తన తప్పును తెలుసుకుని ముషీర్‌కు క్షమాపణలు చెప్పాడు. పృథ్వీ అతడితోతో నేను నీకు అన్నయ్య లాంటివాడిని అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇద్దరి మధ్య ఎటువంటి విబేధాలు లేవు. అంతా బాగానే ఉంది" మహారాష్ట్ర క్రికెట్ అసోయేషిన్ వర్గాలు వెల్లడించాయి. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌కు ముందు ముంబై, మహారాష్ట్ర జట్లు ప్రాక్టీస్ మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మహారాష్ట్ర తరపున ఆడిన పృథ్వీ షా(181) భారీ సెంచరీతో చెలరేగాడు. తొలి రోజు ఆట ముగిస్తుందన్న సమయంలో పృథ్వీ.. ముషీర్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించాడు. ముషీర్ వికెట్ తీసిన తర్వాత "థాంక్యూ" అని కాస్త వ్యంగ్యంగా అన్నాడు. దీంతో పృథ్వీ షా కోపంతో ఊగిపోయాడు. ముషీర్‌ను బ్యాట్‌తో కొట్టేందుకు అతడు వెళ్లాడు. అంపైర్లు, సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఈ వ్యవహరంపై ముంబై, మహారాష్ట్ర సీరియస్ అయ్యాయి. విచారణకు ఆదేశించాయి. అంతలోనే ముషీర్‌కు పృథ్వీ సారీ వివాదాన్ని ముగించాడు.
సన్‌రైజర్స్ యాజమాన్యంతో గొడవ.. దిగ్గజం అవుట్
మాజీ ఇంగ్లండ్ ప్లేయర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఐపీఎల్) సిస్టర్ ఫ్రాంచైజీ అయిన నార్త్రన్ సూపర్ ఛార్జర్స్‌తో బంధాన్ని తెంచుకున్నాడు. గత రెండు సీజన్లుగా సూపర్ ఛార్జర్స్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఫ్లింటాఫ్.. యాజమాన్యంతో విభేదాల కారణంగా పదవి నుంచి వైదొలిగాడు. సూపర్ ఛార్జర్స్ యాజమాన్యానికి ఫ్లింటాఫ్‌కు పారితోషికం విషయంలో గొడవ జరిగినట్లు తెలుస్తుంది. సన్‌రైజర్స్ యాజమాన్యం సూపర్ ఛార్జర్స్‌ను ఓవర్టేక్ చేశాక ఫ్లింటాఫ్‌కు జీతం పెంచుతామని మాట ఇచ్చారట. అయితే ఈ పెంపు నామమాత్రంగా ఉండటంతో ఫ్లింటాఫ్ అసంతృప్తిగా ఉన్నాడు. ఈ విషయాన్ని యాజమాన్యం వద్ద ప్రస్తావించినా పెద్దగా పట్టించుకోకపోవడడంతో కోచ్ పదవికి రాజీనామా చేశాడు. సూపర్ ఛార్జర్స్ ఆఫర్ చేసే దానికంటే నా సేవలకు చాలా విలువైనవని ఫ్రాంచైజీని వీడాక ఫ్లింటాఫ్ అన్నాడు. 47 ఏళ్ల ఫ్లింటాఫ్ గత రెండు సీజన్లలో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్‌కు హెడ్ కోచ్‌గా పని చేశాడు. ఈ రెండు సీజన్లను ఆ జట్టు నాలుగు, మూడు స్థానాలతో ముగించింది.