కోహ్లీ సేనకు భారీ షాక్.. కీలక ఆటగాడు దూరం
RCB: ఐపీఎల్లో కోహ్లీ సేనకు షాక్ తగిలింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇప్పటికే ఆ జట్టుకు విదేశీ క్రికెటర్లు, కోచ్ దూరమైన సంగతి తెలిసిందే.;
IPL 2021: ఐపీఎల్లో కోహ్లీ సేనకు షాక్ తగిలింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇప్పటికే ఆ జట్టుకు విదేశీ క్రికెటర్లు, కోచ్ దూరమైన సంగతి తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కీలక ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ మిగతా మ్యాచులకు దూరం కానున్నాడు. ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో సుందర్ గాయపడ్డాడు. బీసీసీఐ అతన్ని స్వదేశానికి తరలించింది. గాయం నుంచి సుందర్ పూర్తిగాకోలుకోలేదని తెలుస్తోంది.
సుందర్ రెండో విడత ఐపీఎల్‌కు దూరమవుతున్నాడని తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో కోచ్ సైమన్ కటిచ్ దూరమవ్వడంతో క్రికెట్ డైరెక్టర్ హెసెన్ ఆ బాధ్యతలు తీసుకున్నాడు.
వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆకాశ్‌దీప్ అనే యువు క్రికెటర్ కి అవకాశం ఇవ్వనున్నారు. బెంగాల్ యువ క్రికెటరైన ఆకాశ్‌దీప్ నెట్‌బౌలర్‌గా ఉన్నాడు. సుందర్ స్థానంలో ఆర్‌సీబీ ఆకాశ్‌దీప్ ఎంపిక చేసింది. ఆర్సీబీ ఇటీవలే శ్రీలంక నుంచి దుష్మంత చమీరా, హసరంగను జట్టులోకి తీసుకుంది.
వాషింగ్టన్ సుందర్ అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. ఒకప్పుడు కేవలం టీ20లకే సరిపోతాడని భావించిన అతడు ఆస్ట్రేలియాలో టెస్టు క్రికెట్లో అదరగొట్టాడు. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ రెండో దశ ఆరంభం కానుంది. కొన్ని జట్లు దుబాయ్ చేరుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంకా యూఏఈకి వెళ్లలేదు.