RCB: ఆర్సీబీ భవిష్యత్తు ఎవరి చేతుల్లో..?
ఆర్సీబీ జట్టు అమ్మకం ప్రక్రియ మొదలుపెట్టిన డియాజియో... అంచనా విలువ రూ. 17,775 కోట్లు... బ్రాండ్ వాల్యూ 269 మిలియన్ డాలర్లు..
18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలిసారి ప్రతిష్టాత్మక ఐపీఎల్ ట్రోఫీ నెగ్గింది. దీంతో ఒక్కసారిగా టీం బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. అమెరికాకు చెందిన హౌలిహన్ లొకే అనే ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ తాజా లెక్కల ప్రకారం ఆర్సీబీ విలువ ఏకంగా 18.5 శాతం పెరిగింది. ఏకంగా రూ.1.6 లక్షల కోట్ల మార్కెట్ విలువతో ప్రత్యర్థులకు షాకిచ్చింది బెంగళూరు ఫ్రాంచైజీ. అదే సమయంలో ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ 14శాతం పెరిగడంతో.. రూ.33,000 కోట్లకు చేరింది. కట్ చేస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. విజయ సంబరాలలో తొక్కిసలాట దీంతో పరిస్థితులు అంత తలకిందులు అయ్యాయి.
ఆర్సీబీ ఫర్ సేల్
గతంలో ఆర్సీబీ ప్రాంచైజీ ప్రముఖ వ్యాపారి విజయ్ మాల్యా సొంతం. 2016లో మాల్యా తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో పడినప్పుడు డియాజియో కంపెనీ మాల్యా మద్యం కంపెనీతో పాటు ఆర్సీబీని కూడా కొనుగోలు చేసింది. 2008లో మాల్యా తిరిగి ఆర్సీబీని 111.6 మిలియన్ డాలర్ల కు కొనుగోలు చేశాడు. 2014లో డియాజియో యూఎస్ఎల్ మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. 2016 నాటికి మాల్యా నిష్క్రమణ తర్వాత డియాజియో ఆర్సీబీని పూర్తిగా సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ జట్టును యూఎస్ఎల్ అనుబంధ సంస్థ రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఇప్పుడు వీరు ఆర్సీబీ జట్టును అమ్మడానికి సిద్ధపడ్డారు. ఇప్పటికే దానికి సంబంధించిన అధికారిక ప్రక్రియ కూడా మొదలు పెట్టారు. ఆర్సీబీ చాలా పాపులారిటీ. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ వల్ల బలమైన సపోర్ట్ కూడా ఉంది. సపోర్ట్ కూడా ఉంది. ఇప్పుడు ఈ టీం అమ్మకానికి ఉన్నట్లు తెలియడంతో బెంగళూరుకు చెందిన వ్యాపార దిగ్గజాలు ఈ టీమ్ ను చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. రేసులో ముందున్నవారిలో జెరోధా కో-ఫౌండర్ నిఖిల్ కామత్, మనీపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ చైర్మన్ రంజన్ పై, సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ అదార్ పూనవాలా పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిఖిల్ కామత్, రంజన్ పై ఇద్దరూ కర్ణాటక మూలాలు ఉన్నవారు. వీరిద్దరూ ప్రధాన పోటీదారులు. ఇక అదార్ పూనవాలా సోషల్ మీడియాలో 'సరైన ధరకు ఆర్సీబీ మంచి జట్టు' అని గతంలో చేసిన పోస్టు వైరల్ అయింది. RCB విలువ 1 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అంచనా. కామత్, పై, పూనవాలా కలిసి కన్సార్షియంగా బిడ్ పెట్టొచ్చని కూడా తెలుస్తోంది. ఇక వీరితో పాటు మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. JSW గ్రూప్‌కు చెందిన పార్థ్ జిందల్, అదానీ గ్రూప్, RJ కార్ప్‌కు చెందిన రవి జైపూరియా, అమెరికా ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లు కూడా పోటీలో ఉండే అవకాశముంది. రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో పెట్టుబడిపై సమీక్ష ప్రారంభిస్తున్నట్లు యూఎస్ఎల్ లేఖలో పేర్కొంది. అమ్మకానికి ఆర్సీబీ పురుషులు, మహిళల జట్లు ఉన్నాయి. రెండు టీమ్స్ అమ్మకం ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తిచేయాలని కంపెనీ ఆశిస్తోంది. ఈ విషయంపై యూఎస్ఎల్ సీఈవో, ఎండీ ప్రవీణ్ సోమేశ్వర్ మాట్లాడారు. ‘యూఎస్ఎల్కు ఆర్‌ఎస్‌పీఎల్ విలువైన, వ్యూహాత్మక ఆస్తి. జట్టును డియాజియో కంపెనీ సొంతం చేసుకోవడం పట్ల చాలా మంది వాటాదారులు అసంతృప్తిగా ఉన్నారు’ అని తెలిపారు.