RECORD: 50 ఓవర్ల మ్యాచులో.. ఒక్కడే 300 కొట్టేశాడు
ఊచకోత కోసిన హర్జాస్ సింగ్
వన్డే క్రికెట్ లో అద్భుతం జరిగింది. ఆస్ట్రేలియాకు చెందిన హర్జాస్ సింగ్.. సిడ్నీ గ్రేడ్ క్రికెట్‌లో ఆడుతూ 300కుపైగా స్కోరు చేశాడు. కేవలం 135 బంతుల్లోనే 308 పరుగులు చేశాడు. ఇందులో 35 సిక్స్‌లు ఉన్నాయి. వన్డే మ్యాచుల్లో ఓ బ్యాటర్ డబుల్ సెంచరీ సాధిస్తే అద్భుతం అనుకుంటాం. కానీ హర్జాస్ సింగ్ మాత్రం విధ్వంసకర బ్యాటింగ్ తో 300 పరుగులు చేశాడు. వెస్ట్రర్న్ సబర్బ్స్ తరఫున హర్జాస్ ఊచకోత కోశాడు.హర్జాస్ సింగ్ తన సెంచరీని చేరుకోవడానికి 74 బంతులు తీసుకున్నాడు. కేవలం 103 బంతుల్లోనే అద్భుతమైన డబుల్ సెంచరీ సాధించాడు. ఆపై 29 బంతుల్లోనే మరో సెంచరీని పూర్తి చేశాడు.
చరిత్రలో ముగ్గురే
దేశీయ వన్డే క్రికెట్‌లో హర్జాస్తో కలిపి ట్రిపుల్ శతకం చేసింది ముగ్గురే బ్యాటర్లు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ రికార్డు ఇప్పటి వరకు నమోదు కాలేదు. ఇంతకుముందు న్యూసౌత్ వేల్స్ ప్రీమియర్ ఫస్ట్ గ్రేడ్ క్రికెట్ చరిత్రలో విక్టర్ ట్రంపర్ (1903), ఫిల్ జాక్వెస్ (2007) త్రిశతకాలు బాదారు. విక్టర్ 335 పరుగులు చేయగా.. ఫిల్ 321 పరుగులు చేశాడు. వారిద్దరి తర్వాత హర్జాస్ నిలిచాడు.