ROHINI KALAM: అంతర్జాతీయ క్రీడాకారిణి రోహిణి కలాం ఆత్మహత్య.

Update: 2025-10-26 14:00 GMT

రా­ధా­గం­జ్‌­లో­ని అర్జు­న్ నగర్ ని­వా­సి అయిన అం­త­ర్జా­తీయ జు­జి­ట్సు క్రీ­డా­కా­రి­ణి, మా­ర్ష­ల్ ఆర్ట్స్ కోచ్ రో­హి­ణి కలాం (35) ఉరి వే­సు­కు­ని ఆత్మ­హ­త్య­కు పా­ల్ప­డిం­ది. ని­వే­ది­కల ప్ర­కా­రం, రో­హి­ణి అష్టా­లో­ని ఒక ప్రై­వే­ట్ పా­ఠ­శా­ల­లో మా­ర్ష­ల్ ఆర్ట్స్ కో­చ్‌­గా పని­చే­స్తుం­ద­ని.. ని­న్న­నే దే­వా­స్‌­కు తి­రి­గి వచ్చిం­ద­ని వె­ల్ల­డిం­చా­యి. కు­టుంబ సభ్యుల ప్ర­కా­రం, ఆది­వా­రం ఉదయం రో­హి­ణి బా­గా­నే ఉన్న­ట్లు తె­లి­పా­రు. అల్పా­హా­రం తర్వాత, ఆమె­కు ఫోన్ కాల్ వచ్చిం­ద­ని.. ఆ తర్వాత ఆమె గది­లో­కి వె­ళ్లి లో­ప­లి నుం­డి తలు­పు లాక్ చే­సు­కు­న్న­ట్లు తె­లి­పా­రు. ఆమె చాలా సేపు బయ­ట­కు రా­క­పో­యే­స­రి­కి, ఆమె చె­ల్లె­లు ఒక ఇనుప రాడ్ (కడ్డీ)తో తలు­పు పగ­ల­గొ­ట్టి చూ­డ­గా, రో­హి­ణి ఉరి వే­సు­కు­ని కని­పిం­చిం­ద­ని తెలిపా­రు.

దర్యాప్తు ఆరంభం

రో­హి­ణి కలాం చె­ల్లె­లు ఒక ఇనుప రా­డ్‌­తో తలు­పు­ను పగ­ల­గొ­ట్టి గది­లో­కి చూ­డ­గా, రో­హి­ణి ఉరి వే­సు­కు­ని మృ­త­దే­హం­గా కని­పిం­చిం­ది.గత సం­వ­త్స­రం, అబు­దా­బి­లో జరి­గిన అం­త­ర్జా­తీయ జు­జి­ట్సు పో­టీ­లో రో­హి­ణి కలాం కాం­స్య పత­కా­న్ని గె­లు­చు­కు­న్న­ది. ఇటీ­వల ఆమె కడు­పు­లో కణి­తి­కి శస్త్ర­చి­కి­త్స జరి­గి­న­ట్లు కు­టుంబ సభ్యు­లు తె­లి­పా­రు. ప్ర­స్తు­తా­ని­కి ఆత్మ­హ­త్య­కు గల కా­ర­ణం స్ప­ష్టం­గా తె­లి­య­లే­దు, ఎటు­వం­టి సూ­సై­డ్ నోట్ కూడా లభిం­చ­లే­దు. సమా­చా­రం అం­దు­కు­న్న బి­ఎ­న్‌­పి పో­లీ­సు­లు ఘటనా స్థ­లా­ని­కి చేరి మృ­త­దే­హా­న్ని జి­ల్లా ఆసు­ప­త్రి­కి పో­స్టు­మా­ర్టం కోసం పం­పిం­చా­రు. పో­లీ­సు­లు కేసు నమో­దు చేసి, దర్యా­ప్తు ప్రా­రం­భిం­చి­న­ట్లు తె­లి­పా­రు. మంచి భవి­ష్య­త్తు ఉన్న రో­హి­ణి కలాం ఆత్మ­హ­త్య చే­సు­కో­వ­డం క్రీ­డా ప్ర­పం­చా­న్ని షాక్ కు గురి చే­సిం­ది. నె­ట్టింట క్రీ­డా­కా­రు­లు సం­తా­పం తె­లు­పు­తు­న్నా­రు.

Tags:    

Similar News